Site icon NTV Telugu

Mollywood : మలయాళ ఇండస్ట్రీలో ‘ఓనం’ సినిమాల మధ్య పోటీ.. గెలిచేదెవరో?

Mollywood

Mollywood

ఎన్ని ఫెస్టివల్స్ ఉన్నా కేరళకు ప్రత్యేకమైన పండుగ ఓనం. మనకు సంక్రాంతి ఎలాగో వాళ్లకదీ సంప్రదాయ పండుగ. అందుకే ఈ ఫెస్టివల్‌పై ఎంటర్టైన్ మెంట్ రంగం కూడా ఫోకస్ చేస్తూ ఉంటుంది. ఎవ్రీ ఇయర్‌లానే ఈ ఏడాది కూడా కొన్ని మాలీవుడ్ చిత్రాలు ఓనమ్ పండుగను టార్గెట్ చేస్తూ బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించుకునేందుకు రెడీ అవుతున్నాయి. అందులో ఫస్ట్ వరుసలో ఉంది లోక. మిన్నల్ మురళి ఇచ్చిన ఇన్ఫిరేషన్‌తో సిద్దమైన ఈ ఫస్ట్ సూపర్ ఉమెన్ కథ ఆగస్టు 28న రిలీజ్ అవుతుంది. కళ్యాణీ ప్రియదర్శన్, నస్లేన్ హీరో హీరోయిన్స్. దుల్కర్ సల్మాన్ వే ఫార్మర్ బ్యానర్‌పై నిర్మిస్తున్నాడు. పాన్ ఇండియా లెవల్లో పలు భాషల్లో రిలీజౌతోంది

Also Read : Pawan Kalyan : బడా నిర్మాత చేతికి నైజాం ‘OG’ థియేట్రికల్ రైట్స్..

ఇక మాలీవుడ్‌లో రికార్డులు సృష్టించాలన్నా తిరగరాయాలన్న మోహన్ లాల్‌కే సాధ్యం. ఈ ఏడాది ఎంపురన్‌ను మల్లూవుడ్‌లోనే హయ్యెస్ట్ గ్రాసర్ చిత్రంగా మారిస్తే.. అదే ఫ్లోతో తుడరమ్‌తో మరో బ్లాక్ బస్టర్ నమోదు చేశారు లాలట్టన్. నెక్ట్స్ హృదయపూర్వం అనే మరో ఫ్యామిలీ డ్రామాతో ఓనమ్ సీజన్‌లోనే బరిలోకి దిగుతున్నారు. ఆగస్టు 28నే హృదయ పూర్వం రిలీజ్ ప్లాన్ చేశారు మేకర్స్. ఇప్పటికే డబుల్ మూవీస్‌తో, డబుల్ హండ్రెడ్ క్రోర్ చిత్రాలను దింపిన లాలట్టన్.. మరో హ్యాట్రిక్ హిట్ అందుకుంటారేమో చూడాలి. ఇక ఇదే ఓనమ్ పండుగకు మరో టూ ఫిల్మ్స్ కూడా వస్తున్నాయి. ఒక్క రోజు తేడాతో ప్రీతి ముకుందన్ మాలీవుడ్ ఎంట్రీ ఫిల్మ్ ‘మైనే ప్యార్ కియాతో’ పాటు.. కళ్యాణీ ప్రియదర్శన్, ఫహాద్ ఫజిల్ ‘ఒడుం కుతిరా చదుమ్ కుతిరా’ ఆగస్టు 29న థియేటర్లలో పలకరిస్తున్నాయి. హీరోలతో పోటీగా ఈ ఫెస్టివల్ సీజన్లో కళ్యాణీ టూ ఫిల్మ్స్ తీసుకు వచ్చేస్తోంది. ఇది ఆమెకు టెస్టింట్ టైం. మరీ ఓనం పండుగకు అసలు సిసలైన ఫెస్టివల్ వైబ్స్ ఎవరు తెస్తారో..? ఏ సినిమా హిట్ అందుకుంటుందో చూడాలి.

Exit mobile version