NTV Telugu Site icon

CommitteeKurrollu: అదరగొడుతున్న కమిటీ కుర్రోళ్ళు 5 రోజుల కలక్షన్స్ ఎంతంటే..?

Untitled Design 2024 08 14t123226.343

Untitled Design 2024 08 14t123226.343

నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై రూపొందిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. ఈ సినిమాకు య‌దు వంశీ ద‌ర్శ‌కుడు. ఆగస్ట్ 9న రిలీజైన 10 సినిమాలలో ఓన్లీ కమిటీ కుర్రోళ్ళు మాత్రమే హిట్ టాక్ తెచుకుంది. ఈ సినిమా డిఫరెంట్ కంటెంట్‌తో ఇటు ఫ్యామిలీ ఆడియెన్స్‌, అటు యూత్‌ను ఆక‌ట్టుకున్న ఈ చిత్రం సోమవారం వర్కింగ్ డే నాడు కలెక్షన్స్ ఎక్కడా డ్రాప్ అవ్వకుండా అన్నీ ఏరియాస్‌లో సినిమా బ్రేక్ ఈవెన్ సాధించ‌టం విశేషం. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని వంశీ నందిపాటి విడుదల చేశారు.

Also Read: Prabhas: రెబల్ స్టార్ ‘ది రాజా సాబ్’ అప్ డేట్ వచ్చేసిందోచ్..

చిన్న సినిమాగా రిలీజైన ఈ సినిమా పెద్ద హిట్ సాధించే దిశగా పయనిస్తోంది. ప్రస్తుతం ‘కమిటీ కుర్రోళ్ళు’ ఐదు రోజుల్లో రూ. 8.49 కోట్లు కలెక్షన్స్ సాధించిందని నిర్మాణ సంస్థ అధికారకంగా ప్రకటించింది. మంచి ప‌ల్లెటూరి వాతావ‌ర‌ణంలో స్నేహం, ప్రేమ‌, కుటుంబంలోని భావోద్వేగాల‌ను ‘కమిటీ కుర్రోళ్ళు’ చిత్రంలో సీనియ‌ర్ న‌టీన‌టుల‌తో పాటు 11 మంది హీరోలు, న‌లుగురు హీరోయిన్స్‌ను తెలుగు సినిమాకు ప‌రిచ‌యం చేస్తూ మేక‌ర్స్ చేసిన ఈ ప్ర‌య‌త్నాన్ని అభినందిస్తూ ప్రేక్ష‌కులు సినిమాను ఆద‌రించార‌ని ట్రేడ్ వ‌ర్గాలంటున్నాయి. సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిందని చిత్ర యూనిట్ తెలియజేసింది. ఆగస్టు 15 లాంగ్ వీకెండ్ నేపథ్యంలో కమిటీ కుర్రోళ్ళు మరిన్ని కలెక్షన్స్ రాబట్టే అవకాశం ఉంది. మరోవైపు ఈ చిత్ర నిర్మాత నిహారిక కొణిదెలకు టాలీవుడ్ ప్రముఖ దర్శకులు, హీరోలు అభినందనల తెలియజేస్తున్నారు. మెగా బ్రదర్ రామ్ చరణ్ నిహారిక ఈ విజ‌యానికి నువ్వు అర్హురాలివి.. నీ టీమ్‌తో క‌లిసి నువ్వు ప‌డ్డ క‌ష్టం, నిబ‌ద్ధ‌త స్ఫూర్తినిస్తున్నాయని అభినందించారు.

Show comments