Site icon NTV Telugu

విశాల్ మూవీ టైటిల్ పై రచ్చ!

Co Director title stole Allegations on vishal

కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ ప్రస్తుతం ‘నాట్ ఏ కామన్ మ్యాన్’ పేరుతో ఓ సినిమా చేస్తున్నాడు. ఇప్పుడు ఆ టైటిల్ కారణంగా అతను వివాదంలో చిక్కుకున్నాడు. ఆ టైటిల్ తన నుండి విశాల్ కొట్టేశాడంటూ అసిస్టెంట్ డైరెక్టర్ విజయ్ ఆనంద్ ఆరోపిస్తున్నాడు. అంతేకాదు… స్టాలిన్ తనయుడు, నట నిర్మాత, ఎమ్మెల్యే ఉదయనిధి స్టాలిన్ దృష్టికి ఈ వివాదాన్ని తీసుకెళ్ళాడు. శరవణన్ అనే కొత్త దర్శకుడితో విశాల్ ‘నాట్ ఏ కామన్ మ్యాన్’ మూవీ తీస్తున్నాడు.

Read Also : హీరోయిన్ రంగుపై ట్రోలింగ్… పోలీసులకు ఫిర్యాదు

అయితే పదిహేనేళ్ళుగా దర్శకత్వ శాఖలో పనిచేస్తున్న విజయ్ ఆనంద్… ‘నాట్ ఏ కామన్ మ్యాన్’ అనే టైటిల్ తో విశాల్ ‘చక్ర’ మూవీ షూటింగ్ చేస్తున్న సమయంలో ఓ కథ చెప్పాడట. ఇప్పుడు తన సినిమా టైటిల్ ను ఇల్లీగల్ గా విశాల్ తన మూవీకి పెట్టేసుకున్నాడని ఆరోపిస్తున్నాడు. ఈ విషయం తన దృష్టికి రాగానే ఇది సబబు కాదని విశాల్ తో చెప్పానని, అప్పుడు మౌనంగా ఉన్న ఆయన… ఆ తర్వాత అదే టైటిల్ ను తన సినిమాకు పెట్టేశాడని వాపోతున్నాడు. ఇప్పుడు విశాల్ ను ఈ విషయమై ప్రశ్నిస్తే అతని మనుషులు తనను బెదిరిస్తున్నారంటూ ఉదయినిధి స్టాలిన్ కు విజయ్ ఆనంద్ ఫిర్యాదు చేశాడట.

Exit mobile version