NTV Telugu Site icon

Revanth Reddy: అల్లు అర్జున్ అరెస్ట్ పై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి

Allu Arjun Cm Revanth Reddy

Allu Arjun Cm Revanth Reddy

హైదరాబాద్‌ లో హీరో అల్లు అర్జున్‌ అరెస్ట్ అయ్యారు. సంధ్య థియేటర్‌ తొక్కిసలాట ఘటనలో చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ క్రమంలో అల్లు అర్జున్‌పై నాలుగు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 105, 118(1), రెడ్‌ విత్‌ 3/5 BNS సెక్షన్ల కింద కేసు పెట్టగా 105 సెక్షన్‌ నాన్‌బెయిలబుల్ కేసు కాగా 5 నుంచి 10 ఏళ్లు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. BNS 118(1) కింద ఏడాది నుంచి పదేళ్ల శిక్ష పడే అవకాశం ఉందని అంటున్నారు. ఇక గాంధీ ఆస్పత్రికి అల్లు అర్జున్‌ ను తరలించి గాంధీ ఆస్పత్రిలో అల్లు అర్జున్‌కు వైద్య పరీక్షలు నిర్వహించారు. అల్లుఅర్జున్‌కు వైద్య పరీక్షలు ముగిసిన అనంతరం నాంపల్లి కోర్డుకు తరలించారు.

Allu Arjun: అల్లు అర్జున్‌ అరెస్ట్.. ఇంటికి సతీసమేతంగా చిరంజీవి!

ఇక ఢిల్లీలో ఉన్న సీఎం రేవంత్‌ రెడ్డి అల్లుఅర్జున్‌ అరెస్ట్‌ వ్యవహారంపై స్పందించారు. చట్టం తనపని తాను చేసుకుపోతుందన్న సీఎం రేవంత్‌, ఇందులో నా జోక్యం ఏమీ ఉండదు. చట్టం ముందు అంతా సమానమే అంటూ కామెంట్ చేశారు. తొక్కిసలాటలో ఒకరు చనిపోయిన నేపథ్యంలో పోలీసులు చర్యలు తీసుకుంటున్నారని ఆయన అన్నారు. ఇక మోహన్ బాబు వివాదం మీద కూడా స్పందించిన అయన ఆ విషయంలో కోర్టు ఉత్తర్వులున్నాయని అన్నారు.