Site icon NTV Telugu

“నవరస” రిలీజ్ డేట్ రివీల్ చేసిన సినిమాటోగ్రాఫర్

Cinematographer PC Sreeram Reveals Navarasa's Release Date

ప్రముఖ దర్శకుడు మణిరత్నం, జయేంద్ర పంచపకేసన్ సంయుక్తంగా నిర్మిస్తున్న యాంథాలజీ వెబ్ సిరీస్ “నవరస”. తొమ్మిది మంది దర్శకులు తొమ్మిది కథలు చెబుతుండటంతో తమిళ స్టార్స్ కూడా స్మార్ట్ స్క్రీన్స్ పై… చాలా మందే కనిపించబోతున్నారు. సూర్య, రేవతి, ప్రసన్న, నిత్యా మీనన్, పార్వతి, సిద్ధార్థ్, విజయ్ సేతుపతి, ప్రకాష్ రాజ్, విక్రంత్, గౌతమ్ కార్తీక్, సింహా, పూర్ణ, అశోక్ సెల్వన్, ఐశ్వర్య రాజేష్ వంటి నటీనటులు “నవరస”లో భాగమయ్యారు. ఈ వెబ్ సిరీస్ కు ఎ.ఆర్.రహ్మాన్, గిబ్రాన్, డి ఇమ్మాన్, అరుల్ దేవ్, కార్తీక్, రాన్ ఏతాన్, గోవింద్ వసంత, జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించారు. సంతోష్ శివన్, బాలసుబ్రమణియం, మనోజ్ పరమహంస, అభినందన్ రామానుజం, శ్రేయాస్ కృష్ణ్ బాబు, విరాజ్ సింగ్ సినిమాటోగ్రఫీ అందించారు. ఇక “నవరస” నుండి వచ్చే ఆదాయం తమిళ చిత్ర పరిశ్రమలోని 10,000 మంది కార్మికులకు సహాయం చేస్తుంది. అయితే ఈ వెబ్ సిరీస్ విడుదల తేదీని ప్రముఖ సినిమాటోగ్రాఫర్ పిసి శ్రీరామ్ రివీల్ చేశారు. ప్రముఖ ఓటిటి వేదిక నెట్ ఫ్లిక్స్ లో ఆగస్టులో “నవరస” రిలీజ్ అవుతుందని శ్రీరామ్ పోస్ట్ చేశారు.

Exit mobile version