OG Satellite Rights: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన మోస్ట్ స్టైలిష్ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా ‘OG’ (ఓరిజినల్ గ్యాంగ్‌స్టర్) బాక్సాఫీస్ దగ్గర ఎంతటి విధ్వంసం సృష్టించిందో అందరికీ తెలిసిందే. రన్‌రాజా రన్, సాహో ఫేమ్ డైరెక్టర్ సుజిత్ మార్క్ టేకింగ్, పవన్ కళ్యాణ్ వన్-మ్యాన్ షోతో ఈ చిత్రం థియేటర్లలో కాసుల వర్షం కురిపించింది. దీనికి తోడు మ్యూజిక్ డైరెక్టర్ థమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, సాంగ్స్ సినిమాను నెక్ట్స్ లెవెల్‌కు తీసుకెళ్లాయి. అయితే ఈ చిత్రం ఇప్పటికే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నప్పటికీ.. శాటిలైట్ (టెలివిజన్) హక్కుల బిజినెస్ మాత్రం గత కొంతకాలంగా సందిగ్ధంలోనే ఉంది. ఈ నేపథ్యంలో బుల్లితెరపై ‘OG’ ఏ ఛానల్‌లో టెలికాస్ట్ కాబోతుందనే సస్పెన్స్‌కు ఎట్టకేలకు తెరపడినట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం.
ఫిలింనగర్ వర్గాల సమాచారం ప్రకారం.. ‘OG’ శాటిలైట్ రైట్స్‌ను ‘ఈటీవీ’ (ETV) ఫ్యాన్సీ రేటుకు దక్కించుకున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామాను బుల్లితెరపై ప్రసారం చేయడానికి ఛానల్ యాజమాన్యం ప్లాన్ చేస్తోందని సినీ సర్కిల్‌లో జోరుగా ప్రచారం జరుగుతుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన, వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ డేట్ త్వరలోనే అనౌన్స్ చేసే ఛాన్స్ ఉంది. థియేటర్లు, ఓటీటీలలో బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన ఈ చిత్రం.. ఇప్పుడు బుల్లితెరపై టీఆర్‌పీ పరంగా ఎలాంటి రికార్డులను తిరగరాస్తుందో చూడాలి. డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై డివివి దానయ్య నిర్మించిన ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటించగా, బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మి పవర్‌ఫుల్ విలన్ పాత్రలో మెప్పించారు.
