NTV Telugu Site icon

Pushpa 2 Effect : పోలీసుల వలయంలో సినిమా ఈవెంట్లు

Telangana Police

Telangana Police

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన తర్వాత తెలంగాణ పోలీసులు సినీ ఈవెంట్స్ విషయంలో సీరియస్ గా ఉన్నారు. తొక్కిసలాట ఘటనలో ఒక మహిళ మృతి చెందడం, ఒక బాలుడు చావు బతుకుల మధ్య ఉండడంతో ఏకంగా ఒక స్టార్ హీరోని అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది, నేషనల్ వైడ్ చర్చ జరిగింది. ఈ నేపథ్యంలోనే హైదరాబాదులో ఎలాంటి ఈవెంట్స్ చేయాలన్నా ఇప్పుడు కచ్చితంగా పోలీస్ పర్మిషన్ కావాల్సి వస్తోంది. తాజాగా గేమ్ చేంజర్ విషయంలో అయితే సినీ జర్నలిస్టులు ఆశ్చర్యపోయే పరిస్థితులు కనిపించాయి. విషయం ఏమిటంటే నిన్న సాయంత్రం హైదరాబాదులోని ఏఎంబి మాల్ లో రాజమౌళి ముఖ్యఅతిథిగా రామ్ చరణ్ తేజ హీరోగా నటించిన గేమ్ చేంజర్ చిత్రం ట్రైలర్ ఈవెంట్ జరిగింది.

SSMB 29: ష్…. అంతా గప్ చుప్!

నిజానికి గతంలో ఇదే ఏఎంబి మాల్ లో ఈవెంట్స్ జరిగినప్పుడు ఎంత క్రౌడ్ ఉన్నా పెద్దగా హడావుడి లోకుండా లోపలికి వెళ్లే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు సంధ్య థియేటర్ వ్యవహారంలో తొక్కిసలాట జరిగిన నేపద్యంలో నిన్న టికెట్ ఉంటేనే థియేటర్ లోపలికి అనుమతించారు. దానికి తోడు పదుల సంఖ్యలో పోలీసులు ఏఎంబి మాల్ ఎంట్రీ నుంచి లోపల స్క్రీన్ వరకు మోహరించారు. కేవలం కానిస్టేబుల్స్ మాత్రమే కాదు ఎస్ఐ స్థాయి అధికారులు సైతం మోహరించడమే గమనార్హం. సాధారణంగా ఇలాంటి ఈవెంట్స్ జరిపినప్పుడు ఎంత ఎక్కువ మంది అభిమానులు వస్తే ఈవెంట్ అంత గ్రాండ్ సక్సెస్ అయినట్లుగా నిర్వాహకులు భావిస్తూ ఉంటారు. కానీ నిన్న కేవలం సినీ జర్నలిస్టులు పదుల సంఖ్యలో అభిమానులు తప్ప ఎవరిని లోపలికి అనుమతించలేదు. చాలా పక్కాగా ప్లాన్ చేశారు, పర్ఫెక్ట్ గా ఇబ్బంది లేకుండా ముగించారు. పుష్ప ఎఫెక్ట్తో ఇప్పుడు భవిష్యత్తులో కూడా కొన్నాళ్లపాటు ఇలా పోలీసుల కనుసన్నల్లోనే ఈవెంట్స్ జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి.

Show comments