చార్మింగ్ స్టార్ శర్వానంద్ హీరోగా మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్స్ మేకర్ సంపత్ నంది దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. శర్వా సినీ కెరీర్ లో 38వ సినిమాగా సంపంత్ నంది సినిమా రానుంది. లక్ష్మీ రాధామోహన్ సమర్పణలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌పై శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌పై అత్యంత భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా కెకె రాధామోహన్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఇది 1960ల చివరలో భారతీయ సెల్యులాయిడ్‌లో ఉత్తర తెలంగాణ, తెలంగాణ – మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న గ్రామీణ నేపథ్యంలో సాగే పల్సేటింగ్ పీరియడ్ యాక్షన్ డ్రామా.
Also Read : Arjun Reddy : ఓర్నీ.. నువ్వు కూడా కాపీ కొట్టావా.. సందీప్ రెడ్డి వంగా..
గ్రిప్పింగ్ యాక్షన్ మరియు ఎమోషనల్ చార్జ్డ్ సీక్వెన్స్‌లతో ఎమోషనల్ కథ, కథనంతో రానుంది శర్వా 38. వెండితెరపై ఇంతకు ముందెన్నడూ రానటువంటి కథ, కథనాలతో యూనివర్సల్ అప్పీల్ లో పాన్ ఇండియా స్థాయిలో చేస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు అనేదానిపై చాలా రోజులుగా డిస్కషన్స్ నడుస్తున్నాయి. అనేక మంది పేర్లు పరిశీలించిన మీదట ఫైనల్ గా సొట్ట బుగ్గల సుందరి అనుపమ పరమేశ్వరన్ ను తీసుకున్నట్టు అధికారకంగా ప్రకటించారు మేకర్స్. 2017 లో వచ్చిన శతమానం భవతి సినిమా తర్వాత శర్వా – అనుపమ మరోసారి జోడి కట్టబోతున్నారు. 60ల నాటి పాత్రను పోషించేందుకు శర్వానంద్ సరికొత్త మేకోవర్‌లో కనిపించనున్నాడు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్న శర్వా 38 సినిమా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం మరియు హిందీ భాషల్లో విడుదల కానుంది. త్వరలో ఈ సినిమా రెగ్యూలర్ షూట్ స్టార్ట్ కానుంది.