చియాన్ విక్రమ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘తంగలాన్’. విభిన్న చిత్రాల దర్శకుడు పా. రంజిత్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. యదార్ధ సంఘటనల ఆధారంగా అత్యంత భారీ బడ్జెట్ లో ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన తంగలాన్ అటు తమిళ్ తో పాటు తెలుగులో ను సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. తంగలాన్ తో పాటు రిలీజ్ అయిన స్ట్రయిట్ తెలుగు సినిమాలకంటే కూడా ఈ తమిళ డబ్బింగ్ సినిమా ఎక్కువ కలెక్షన్స్ రాబడుతుంది.
Also Read: AAY : సూపర్ హిట్ దర్శకుడికి చేదు అనుభవం.. లేవు పొమ్మన్నారు..
కాగా ఈ సినిమాను తెలుగులో ఎక్కువగా ప్రమోట్ చేస్తున్నాడు విక్రమ్. రిలీజ్ కు ముందు ఆంధ్ర అంతటా తిరుగుతూ యూనివర్సిటీలలో స్టూడెంట్స్ తో కలిసి డాన్స్ లు వేస్తూ సినిమాను ఆడియెన్స్ లోకి బాగా తీసుకు వెళ్ళాడు. కానీ ఒక స్టార్ హీరో అయివుండీ రిలీజ్ తర్వాత కూడా ఆంధ్రా, తెలంగాణ తిరుగుతూ ప్రమోట్ చేస్తున్న విధానం చూసి ఆశ్చర్య పోతున్నారు టాలీవుడ్ వర్గాలు. తంగలాన్ సినిమాకి విక్రమ్ ఎంత కష్టపడ్డాడో, ప్రమోషన్స్ తో జనాల్లోకి తీసుకెళ్లడం కోసం కూడా అంతే కష్టపడటం నిజంగా అభినందించదగ్గ విషయం. మరోవైపు తంగలాన్ మొదటి రోజు కంటే కూడా రెండు, మూడు రోజు రోజులలో తెలుగు బుకింగ్స్ ఊపందుకున్నాయి. తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు కథాబలం ఉన్న సినిమాలను ఆదరిస్తారని నా అపరిచితుడు సినిమా ఇండియాలోనే అత్యధిక రోజులు తెలుగులో ఆడిందని అందుకే నాకు టాలీవుడ్ చాలా ప్రత్యేకం అని తంగలాన్ ప్రమోషన్స్ లో భాగంగా విక్రమ్ అన్నారు.