Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య చిత్రం రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. గత కొన్ని రోజులుగా చిత్రబృందం ఈ సినిమా ప్రమోషన్స్‌లో చాలా బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రానికి దర్శకుడు బాబి. ఈ క్రమంలో ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్న చిరంజీవి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. పలు ఆసక్తికర విషయాలను తెలియజేసారు. రోజా వ్యాఖ్యలపై మీ అభిప్రాయం ఏంటని అడిగిన అన్న ప్రశ్నకు చిరంజీవి తనదైన శైలిలో సమాధానమిచ్చారు. ఆమె మాటలపై తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయనని అన్నారు. గతంలో ఆమెతో కలిసి చాలా సినిమాల్లో నటించానని చెప్పుకొచ్చారు మెగాస్టార్. ఆమెతో మనోభావాలు పంచుకున్నానని చెప్పారు. కరోనా సమయంలో బ్లడ్ బ్యాంక్, ఐబ్యాంక్‌లతో పాటు సినీ కార్మికులకు సాయం చేశానని, ఇవన్నీ తన సహాయ స్వభావానికి సమాధానమని చిరంజీవి అన్నారు.
Read also: Over Eating: ఎంత తిన్నా తరచూ ఆకలి వేస్తోందా.. ఈ టిప్స్ పాటించండి..
ఆమె మాటలకు సమాధానం చెబితే తన స్థాయిని తగ్గించుకున్న వాడిని అవుతానని అని చిరంజీవి ఆమెకు సూచించినట్లు సమాచారం. ఆమె మంత్రి అయ్యాక కూడా తన ఇంటికి వచ్చి ఇక్కడే భోజనం చేశామని చిరంజీవి తెలిపారు. వారు ఎలాంటి పరిస్థితుల్లో మాట్లాడారో తెలియక స్పందించే స్వభావం నాది కాదని, వాళ్లు ఏం మాట్లాడినా వారి విజ్ఞతకే వదిలేస్తానని చిరంజీవికి తెలియజేసారు. ‘‘అక్కా అక్కా’’, ‘‘సార్ సార్’’ అంటూ చాలాసార్లు మా ఇంట్లో భోజనం చేశారని. నేను కూడా ఆత్మీయంగా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తానని ఇంటర్వూలో తెలిపారు చిరు. అయితే.. వాళ్లు మాట్లాడిన మాటలకు కౌంటర్ ఇచ్చేసి వాళ్లను తగ్గించి నా సెంటిమెంటు నేను ఇచ్చే విలువను పోగొట్టుకోలేను అంటూ మెగాస్టార్ తనదైన శైలిలో తెలియజేశారు.
Bandi Sanjay: నేడే కొల్లాపూర్ లో బండి సంజయ్ పర్యటన.. షెడ్యూల్ ఇదే