మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా, బింబిసార ఫేమ్ మల్లిడి వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ సోషియో ఫ్యాంటసీ మూవీ ‘విశ్వంభర’. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తి చేసుకున్నప్పటికీ, గ్రాఫిక్స్ పనుల్లో ఆలస్యం మరియు ఓటీటీ బిజినెస్ కాస్త లేట్ కావడంతో విడుదలపై కొంతకాలంగా సందిగ్ధత నెలకొంది. అటు మెగాస్టార్ చిరు కూడా నెక్ట్స్ సినిమాలపై ఫోకస్ చేసారు. దాంతో విశ్వంభర రిలీజ్ కు అనేక అడ్డంకులు వచ్చాయి.
తాజాగా ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి సంబంధించిన ఓటీటీ బిజినెస్ క్లియర్ అవ్వడంతో రిలీజ్ కు లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం ‘విశ్వంభర’ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కుల కోసం సోనీ లివ్‌తో పాటు పోటీపడిన ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’ ఫైనల్‌గా భారీ ధరకు డిజిటల్ రైట్స్‌ను దక్కించుకున్నట్లు సమాచారం. దీంతో థియేట్రికల్ రిలీజ్‌కు ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయినట్లేనని ఫిలిం నగర్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈ క్రమంలోనే ‘విశ్వంభర’ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13న థియేటర్లలోకి తీసుకురావడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు ఇండస్ట్రీ ఇన్సైడ్ టాక్. అన్ని అనుకున్నట్లు జరిగితే త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. యువి క్రియేషన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమాలో చిరంజీవి సరసన త్రిష కథానాయికగా నటిస్తుండగా ఆస్కార్ విన్నర్ ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. విశ్వంభర గనుక సంక్రాంతికి వస్తే బాబీ డైరెక్షన్ లో చిరు చేస్తున్న కాకా సమ్మర్ కు వెళ్లే అవకాశం ఉంది.

