Site icon NTV Telugu

Kishkindhapuri : “కిష్కింధపురి” పై చిరంజీవి రివ్యూ..

Kishkindhapuri Chiru Review

Kishkindhapuri Chiru Review

టాలీవుడ్‌లో తాజాగా విడుదలైన ఆసక్తికరమైన చిత్రాల్లో ఒకటి ‘కిష్కింధపురి’. ప్రతిభావంతుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాను దర్శకుడు కౌశిక్ పగళ్ళపాటి తెరకెక్కించారు. హారర్ థ్రిల్లర్ జానర్‌లో వచ్చిన ఈ చిత్రం మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుని, థియేటర్లలో సాలిడ్ రన్‌ను కొనసాగిస్తోంది. కాగా ఇప్పటికే ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ అందుకున్న ఈ మూవీపై తాజాగా మెగాస్టార్ చిరంజీవి తన అభిప్రాయాలను పంచుకోవడం వైరల్‌గా మారింది.

Also Read : OG : ఓజి ప్రమోషన్స్‌కు శ్రీకారం చుట్టిన ప్రియాంక మోహన్

ఒక వీడియో ద్వారా ఆయన రివ్యూ ఇచ్చారు.. “కిష్కింధపురి సినిమా నిజంగా నాకు నచ్చింది. ఇది సాధారణ హారర్ మూవీకాకుండా, డైరెక్టర్ కౌశిక్ పగళ్ళపాటి ఒక సైకలాజికల్ యాంగిల్‌ని బాగా చూపించారు. ఆ పాయింట్ చాలా కొత్తగా, ఆసక్తికరంగా ఉంది. అలాగే చైతన్ భరద్వాజ్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, పాటలు సినిమాలోకి మంచి ఎనర్జీని తెచ్చాయి. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ చాలా మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. అనుపమ పరమేశ్వరన్ కూడా తన పాత్రకు న్యాయం చేసింది. ఈ ఇద్దరి నటనతో పాటు, టెక్నికల్ వర్క్ కూడా సినిమా స్థాయిని ఎత్తుకు తీసుకెళ్లింది. నా నెక్స్ట్ సినిమా ‘శివ శంకర వరప్రసాద్ గారు’కి నిర్మాతలుగా వ్యవహరిస్తున్న సాహు గారపాటి గారు ఈ చిత్రానికి మంచి సపోర్ట్ ఇచ్చారు. ఆయన ప్రయత్నం చాలా బాగుంది. ఈ సినిమాను తప్పక థియేటర్లలో చూసి ప్రోత్సహించాలి. ఇది కొత్తగా, వేరే రకం అనుభూతిని ఇస్తుంది” అని అని మెచ్చుకున్నారు చిరంజీవి. ఇలాగే పాజిటివ్ రివ్యూ ఇవ్వడంతో, ఆయన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘కిష్కింధపురి’ కి ఇప్పటికే మంచి టాక్ రావడంతో పాటు, మెగాస్టార్ రివ్యూ కూడా కలిసి వచ్చినందున, రాబోయే రోజుల్లో సినిమా బాక్సాఫీస్ వద్ద మరింత వేగం పుంజుకునే అవకాశం ఉంది.

 

Exit mobile version