Site icon NTV Telugu

Chiranjeevi : చిరంజీవి బ్లడ్ బ్యాంక్ అసలు కథ తెలుసా?

Chiranjeevi

Chiranjeevi

ఫీనిక్స్ ఫౌండేషన్‌ సహకారంతో జరిగిన రక్తదాన కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి, యువ హీరో తేజ సజ్జా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ రక్త దానం యొక్క ప్రాముఖ్యతను, తన బ్లడ్ బ్యాంక్ స్థాపన వెనుక ఉన్న భావోద్వేగ కథను వివరించారు. చిరంజీవి మాట్లాడుతూ..తన బిడ్డలా భావించే తేజ సజ్జా రక్తదానం చేయడం పట్ల ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.. అలాగే

Also Read : Mega Blood Donation : మెగా బ్లడ్ డొనేషన్ డ్రైవ్‌లో తేజ సజ్జా రక్తదానం..

‘ఒక జర్నలిస్ట్ రాసిన ఆర్టికల్‌ వల్లే నాకు ఈ ఆలోచన వచ్చింది, ఆయనను ఇప్పటివరకూ చూసింది లేదు, కానీ ఎప్పటికీ గుర్తుంచుకుంటాను’ అని తెలిపారు. అలాగే చిరంజీవికి ఇటీవల ఎదురైన ఒక అనుభవాన్ని పంచుకుంటూ, భావోద్వేగానికి లోనయ్యారు. ‘ఒక రాజకీయ నాయకుడు నన్ను బహిరంగంగా విమర్శించాడు. కానీ ఆ తర్వాత ఓ ప్రాంతంలో అతనికి ఎదురైన మహిళ ‘చిరంజీవిని ఎందుకు అని మాటలు అన్నారు’ అని నిలదీయడం చూశాను. ఆ మహిళ కుమారుడు నా బ్లడ్ బ్యాంక్ ద్వారా బతికాడని తెలిసి హృదయం భావోద్వేగానికి లోనయ్యింది. సోషల్ మీడియా విమర్శలకు మీరు ఎందుకు స్పందించను అంటారు. నాకు స్పందించాల్సిన అవసరం లేదు. నేను చేసిన మేలు, అభిమానుల ప్రేమే నా రక్షణ కవచాలు. మాటల కంటే మన మంచితనమే ఎక్కువ చెప్పగలదు’ అని స్పష్టం చేశారు చిరంజీవి. అలాగే తనపై నమ్మకంతో రక్తదానం చేస్తున్న అభిమానులు, విదేశాల్లో ఉన్నవారు ఆయనను గర్వించేలాచేస్తున్నారని, వాళ్లందరికీ అభినందనలు తెలుపుతూ –‘నాలాగా మంచి చేసే వారికి ఎల్లప్పుడూ అండగా ఉంటాను’ అని తెలిపారు.

 

Exit mobile version