Site icon NTV Telugu

Chiranjeevi: లండన్ పార్కులో వాకింగ్.. పారిస్ ఒలంపిక్స్ కి రామ్ చరణ్ తో చిరు!

Chiranjeevi Ram Charan Hyde

Chiranjeevi Ram Charan Hyde

Chiranjeevi with Ram Charan and Klinkara at Hyde Park London: మెగాస్టార్ చిరంజీవితో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఒకపక్క సినిమాలు చేస్తూనే మరోపక్క ఫ్యామిలీకి టైం కేటాయిస్తూ ఉంటారని విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఇప్పుడు మెగాస్టార్ తన భార్య సురేఖ, కుమారుడు రామ్ చరణ్ తేజ, కోడలు ఉపాసన కొణిదల అలాగే మనవరాలు క్లీన్ కార కొణిదలతో కలిసి లండన్ లో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు.. ప్రస్తుతానికి రామ్ చరణ్ తేజ గేమ్ చేంజర్ సినిమా షూటింగ్ పూర్తి చేసి పెద్ది సినిమా షూటింగ్ కోసం రెడీ అవుతున్నాడు. ఆ సినిమాకి సంబంధించిన బాడీ బిల్డింగ్ కోసమే ఆయన లండన్ వెళ్లినట్లుగా ప్రచారం జరుగుతోంది.

Anasuya : విజయ్ దేవరకొండతో గొడవ.. మీడియాదే తప్పంటూ అనసూయ షాకింగ్ కామెంట్స్..

మరొకపక్క మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర సినిమాతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతానికి విశ్వంభర సినిమా షూటింగ్ జరుగుతోంది అయితే మెగాస్టార్ చిరంజీవి లేని సీన్స్ షూట్ చేస్తున్నారు. అయితే తాజాగా మెగాస్టార్ చిరంజీవి తన కొడుకు -కోడలు మనవరాలితో కలిసి ఉన్న ఫోటో షేర్ చేసి ప్రస్తుతానికి లండన్ లో ఉన్న హైడ్ పార్క్ లో ఒక మంచి ఫ్యామిలీ మూవ్మెంట్ ఎంజాయ్ చేస్తున్నానని అన్నారు. మేము రేపు పారిస్ వెళ్తున్నామని చెప్పుకొచ్చారు. అక్కడ జరగబోతున్న సమ్మర్ ఒలంపిక్స్ 2024 ఇనాగూరల్ ఈవెంట్లో పాల్గొనబోతున్నట్లు ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి పేర్కొన్నారు.

Exit mobile version