Site icon NTV Telugu

Mega Anil : చిరు సినిమాలో షూట్ పూర్తి చేసిన వెంకటేష్

Chiu Venky

Chiu Venky

మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘మన శంకరవర ప్రసాద్ గారు’లో చిరంజీవి, విక్టరీ వెంకటేష్ స్క్రీన్ షేర్ చేసుకోవడం అభిమానులకు ఒక పెద్ద ట్రీట్‌ కానుంది. తాజాగా, ఈ చిత్రంలో తన పాత్రకు సంబంధించిన షూటింగ్‌ను విక్టరీ వెంకటేష్ పూర్తి చేశారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆయన సోషల్ మీడియాలో ఒక స్పెషల్ పోస్ట్ పెట్టారు. “#మన శంకర వర ప్రసాద్ గారు సినిమా కోసం నా భాగం ఈరోజుతో పూర్తయ్యింది. ఇది ఎంతో అద్భుతమైన అనుభవం! నాకు ఎంతో ఇష్టమైన మెగాస్టార్ చిరంజీవి గారి తో కలిసి పనిచేయడం ఎంతో ఆనందంగా అనిపించింది. ఆయనతో స్క్రీన్‌ షేర్ చేసుకోవాలని ఎంతోకాలంగా ఎదురుచూశాను. ఆ అవకాశాన్ని ఈ ప్రత్యేకమైన సినిమాతో ఇచ్చినందుకు డైరెక్టర్ అనిల్ రావిపూడి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు . మనం అందరం కలిసి 2026 సంక్రాంతిని థియేటర్స్‌లో ఘనంగా సెలబ్రేట్ చేద్దాం.”

Also Read : Roshan Vs Roshan: రోషన్ మేక వర్సెస్ రోషన్ కనకాల

వెంకటేష్ పోస్ట్‌పై స్పందిస్తూ, మెగాస్టార్ చిరంజీవి ఒక ప్రత్యేకమైన పోస్ట్ ని షేర్ చేశారు. “మై డియర్ వెంకీ… మై బ్రదర్. మనిద్దరం కలిసి పనిచేసిన ఈ పది రోజులు నాకు మెమరబుల్. నీతో గడిపిన ప్రతి క్షణం ఆనందంతో, ఎనర్జీతో నిండిపోయింది. ‘మన శంకరవర ప్రసాద్ గారు’ చిత్రానికి నువ్వు ఇచ్చిన ప్రత్యేకమైన ప్రజెన్స్ అబ్బురపరిచింది. నీతో గడిపిన ప్రతి క్షణం ఎంతో ఆనందం కలిగించింది.” అలాగే డైరెక్టర్ అనిల్ రావిపూడి కూడా తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ X (ట్విట్టర్) ఎకౌంట్‌లో పోస్ట్ పెట్టారు.

Also Read : Tollywood : ఆ ఇమేజ్‌కు దూరంగా యంగ్‌ హీరోలు?

“కొన్ని కలలు మన మనసులో సంవత్సరాల పాటు దాగి ఉంటాయి. అకస్మాత్తుగా సినిమా అలాంటి కలలను నిజం చేస్తుంది. మెగాస్టార్ చిరంజీవి గారు, విక్టరీ వెంకటేష్ గారితో పక్కపక్కన నిలబడి, కలిసి నవ్వుతూ, డ్యాన్స్ చేస్తూ, వారి ప్రత్యేకమైన చార్మ్‌తో మెరిసిన ఆ క్షణం…నిజంగా మాటల్లో చెప్పలేనంత ఆనందం ఇచ్చింది. నా ప్రయాణంలో ఇది ఒక గొప్ప గౌరవంగా భావిస్తున్నాను. #ManaShankaraVaraPrasadGaru కోసం తన పార్ట్ ని పూర్తిచేసి, ఈ అందమైన కలను సాకారం చేసిన డియర్ వెంకీ సర్‌కు హృదయపూర్వక ధన్యవాదాలు.” ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదలైన చార్ట్‌బస్టర్ ఫస్ట్ సింగిల్ ‘మీసాల పిల్ల’ రికార్డ్ బ్రేకింగ్ వ్యూస్ సంపాదించి, సినిమాపై భారీ అంచనాలను పెంచింది. ఈ చిత్రం 2026 సంక్రాంతికి బిగ్గెస్ట్ ఎట్రాక్షన్ గా ప్రేక్షకులు ముందుకు రానుంది.

Exit mobile version