NTV Telugu Site icon

Chiranjeevi: ANR జాతీయ అవార్డు అందుకున్న చిరంజీవి

Chiranjeevi Anr Awards

Chiranjeevi Anr Awards

నేడు ఏఎన్నార్ జాతీయ అవార్డ్‌ని మెగాస్టార్ చిరంజీవికి అందించారు. అందుకు సంబంధించిన ఒక ఘ‌న‌మైన వేడుక కూడా నిర్వహించారు. హైద‌రాబాద్ అన్న‌పూర్ణ స్టూడియోస్ లో జరిగిన ఈ వేడుక‌లో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్ త‌న చేతుల‌మీదుగా టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి ఏఎన్నార్ అవార్డును అంద‌జేశారు. నిజానికి 2024 సంవత్సరానికిగానూ మెగాస్టార్‌ చిరంజీవిని ఏఎన్నార్‌ జాతీయ అవార్డు వరించింది.

Nagarjuna: చిరంజీవి డాన్స్ చూసి నాకు గుబులు పుట్టింది!

ఈ విషయాన్ని శతజయంతి రోజునే అక్కినేని నాగార్జున అధికారికంగా ప్రకటించారు. అన్నపూర్ణ స్టూడియోలో జరిగిన అక్కినేని జాతీయ పురస్కార వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన బాలీవుడ్‌ నటుడు అమితాబ్‌ బచ్చన్ చిరంజీవికి పురస్కారాన్ని అతిరధ మహారథుల సమక్షంలో ప్రదానం చేశారు. ఈ వేడుకకు చిరంజీవి కుటుంబ సభ్యులు, నాగార్జున కుటుంబ సభ్యులతోపాటు పలువురు నటీనటులు, దర్శక నిర్మాతలు సహా పలు రంగాల ప్రముఖులు హాజరయ్యారు.

Show comments