NTV Telugu Site icon

Chiranjeevi : మెగాస్టార్ 50 సంవత్సరాల నట ప్రస్థానం.. ఫోటో వైరల్

Chiru 50

Chiru 50

పునాది రాళ్ళు సినిమాతో నాలుగు హీరోల్లో ఒకరిగా టాలీవుడ్ కు పరిచయమయ్యారు చిరంజీవి. ఎవరి అండదండలు, ఎవరి సపోర్ట్ లేకుండా స్వయంకృషితో అంచలంచలుగా ఒక్కో మెట్టు ఎదుగుతూ చిరంజీవి కాస్త మెగాస్టార్ చిరంజీవి గా అశేష సినీ ప్రేక్షకులలతో జేజేలు అనుకున్నారు. ఎందరో యంగ్ హీరోలకు ఆదర్శంగా నిలిచారు మెగా స్టార్. తన నటన, డాన్స్ లతో సిల్వర్ స్క్రీన్ పై అద్భుతాలు సృష్టించి ఎవరు అందుకోలేని శిఖరాలను అధిరోహించాడు మెగా స్టార్.

Also Read : Release Clash : సూర్య కు పోటీగా మహేశ్ బాబు మేనల్లుడు

కానీ చిరు ఇంతటి నటుడు కావడానికి తోలి అడుగుపడింది నాటక రంగంలోనే. చదువుకునే రోజుల్లో తొలిసారి గా నటించిన చిరు ఇప్పటికి నటనను కొసగిస్తూ 50 ఏళ్ళు పూర్తి చేసుకున్నారు. Y N M College Narsapur లో డిగ్రీ రెండవ ఏడాది చదువుకునే రోజుల్లో ‘ రంగస్థలం మీద ‘రాజీనామా’ అనే నాటకంలో తొలిసారిగా నటించారు చిరు. ఈ నాటకానికి కోన గోవింద రావు రచన చేయగా లీడ్ రోల్ లో చిరు నటించారు. ఆ నాటకంలో నటుడిగా గుర్తింపు రావడమే కాకుండా ఉత్తమ నటుడిగా అవార్డుకు ఎంపిక కావడం ఎనలేని ప్రోత్సాహం అందించింది. అది చిరుకు నటుడు కావాలి అనే తన కోరిక పట్ల మరింత బలపడేలా చేసి నేడు మనందరి ముందు మెగా స్టార్ గా నిలబడేలా చేసింది. 1974 తోలి నాటకం వేసినప్పటి నుండి 2024 వరకు 50 సంవత్సరాల నట ప్రస్థానం ఎనలేని ఆనందం గా ఉందనిమెగాస్టార్ చిరంజీవి ఆనాటి మధుర జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ అప్పటి ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగ అభిమానులతో పంచుకున్నారు.