NTV Telugu Site icon

Megastar : చిరంజీవి కి యు.కె పార్లమెంట్‌ లో స‌న్మానం

Chiranjeevi

Chiranjeevi

చిరంజీవి.. ఎలాంటి సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి, తన అద్భుతమైన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. దాదాపు నాలుగున్నర దశాబ్దాలుగా, సినిమాల ద్వారా కళారంగానికి, స‌మాజానికి ఆయన చేసిన సేవ‌లు అంతా ఇంతా కాదు. ఎంతో మంది హీరోలకు ఆయన స్ఫూర్తి గా కూడా నిలిచారు. అలా 2024లో భార‌త ప్రభుత్వం నుంచి, రెండో అత్యున్నత‌ పౌర పుర‌స్కారం పద్మ విభూష‌ణ్‌‌ను అందుకున్నా చిరంజీవి.. గత ఏడాది అత్యంత సమర్ధవంతమైన నటుడు, డ్యాన్సర్‌గా గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌తో సత్కరించబడ్డారు. ఎ.ఎన్‌.ఆర్ శ‌త జ‌యంతి సంద‌ర్భంగా, అక్కినేని ఇంటర్నేషనల్ ఫౌండేషన్ 2024లో చిరంజీవికి ప్రతిష్టాత్మక ఎ.ఎన్‌.ఆర్ జాతీయ అవార్డును ప్రదానం చేసింది. ఇక ఇప్పుడు చిరంజీవికి మరో అరుదైన గౌరవం దక్కింది.

Also Read: ‘#RC16’ : ‘చరణ్ 16’ ఓటీటీ హక్కులకు భారీ డిమాండ్ !

తాజా సమాచారం ప్రకారం యుకె కి చెందిన అధికార లేబ‌ర్ పార్టీ పార్లమెంట్ మెంబ‌ర్ న‌వేందు మిశ్రా, ఈ మార్చి 19న చిరంజీవిని స‌న్మానించ‌నున్నారు. సోజన్ జోసెఫ్, బాబ్ బ్లాక్ మన్ స‌హా ఇత‌ర పార్లమెంట్ స‌భ్యులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. అదే వేదికపై బ్రిడ్జ్ ఇండియా సంస్థ, సినిమా ప్రజాసేవ.. దాతృత్వానికి చిరంజీవి చేసిన కృషిని గుర్తించి కల్చరల్ లీడర్షిప్ ద్వారా ప్రజాసేవలో ఎక్సలెన్స్ కోసం ‘జీవిత సాఫల్య పురస్కారం’ ప్రదానం చేయనున్నారు.

అసలు ఈ బ్రిడ్జ్ ఇండియా సంస్థ అంటే ఏంటీ అంటే. యు.కె లో ఒక ప్రముఖ సంస్థలో ఇదోక్కటి.  పబ్లిక్ పాలసీని రూపొందించడానికి పనిచేస్తుంది. అలాగే వివిధ రంగాల్లోని వ్యక్తులు సాధించిన విజయాలు..వారు తమ చుట్టూ ఉన్న స‌మాజంపై చూపించిన ప్రభావం మ‌రింత విస్తృతం కావాల‌నే ఉద్దేశంతో వారిని సత్కరిస్తుంతుంది. బ్రిడ్జ్ ఇండియా సంస్థ లైఫ్ టైమ్ ఆచీవ్‌మెంట్ అవార్డును తొలిసారిగా అంద‌జేస్తోంది. దాన్ని చిరంజీవి అందుకోనుండ‌టం విశేషం. ఇది ఆయ‌న కీర్తి కీర‌టంలో మ‌రో క‌లికితురాయిగా నిలుస్తుంది.