Chiranjeevi : చిరంజీవి 47 ఏళ్ల సినీ ప్రయాణం.. ప్రాణం ఖరీదు జ్ఞాపకాలను పంచుకున్న మెగాస్టార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగాస్టార్ చిరంజీవి.. తెలుగు సినీ పరిశ్రమలో నాలుగు దశాబ్దాలకు పైగా వెలుగులు నింపిన ఈ మహానటుడు, నేడు తన సినీ ప్రయాణంలో ఓ గొప్ప మైలురాయిని చేరుకున్నారు. ఆయన నటించిన తొలి చిత్రం ప్రాణం ఖరీదు విడుదలై నేటికి 47 ఏళ్లు పూర్తయిన సందర్భంగా చిరు ఒక భావోద్వేగ పోస్ట్ షేర్ చేశారు..‘22 సెప్టెంబర్ 1978.. నేను నటుడిగా మీ ముందుకు వచ్చాను. ప్రాణం ఖరీదు ద్వారా నాకు ప్రాణం పోసి, మీ అన్నయ్యగా, కొడుకుగా, కుటుంబ సభ్యుడిగా, చివరికి మెగాస్టార్‌గా నిలిపింది మీ ప్రేమే. నేటికి 155 సినిమాలను పూర్తి చేసుకున్నాను అంటే అది మీ నిస్వార్థమైన అభిమానం వల్లే సాధ్యమైంది. ఈ 47 ఏళ్లలో నేను అందుకున్న అవార్డులు, గౌరవాలు అని మీవే. మన బంధం ఎప్పటికీ ఇలాగే కొనసాగాలి’’ అని చిరు అభిమానుల పట్ల కృతజ్ఞతలు తెలిపారు.
Also Read : Bad Girl: ‘బ్యాడ్ గర్ల్’ అశ్లీలం కాదు..వివాదం పై స్పందించిన వార్షా భరత్
Also Read
- Prahaar : సాలిడ్ సక్సెస్ కోసం యంగ్ హీరోపై చాలా నమ్మకం పెట్టుకున్న నిర్మాణ సంస్థ
- Legendary Director Singeetham Srinivasa Rao : తెలుగు సినిమా ప్రమోగశాల మూతపడింది..
- Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
- Dada : గాయాన్ని సైతం లెక్కచేయని నందమూరి డెడికేషన్.. బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్న బాలయ్య
1978, సెప్టెంబర్ 22న కొణిదెల శివశంకర వరప్రసాద్ (చిరంజీవి) అనే యువకుడు ప్రాణం ఖరీదు ద్వారా సినీ ప్రేక్షకులకు పరిచయమయ్యాడు. కె. వాసు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో చిరు నరసింహ అనే పాత్రలో నటించారు. రావుగోపాలరావు, జయసుధ, చంద్రమోహన్ వంటి ప్రముఖులతో కలిసి తెరపై కనిపించిన ఆయన, తన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. గమనించదగ్గ విషయం ఏమిటంటే – చిరు కథానాయకుడిగా తొలుత చేసిన చిత్రం పునాది రాళ్లు. కానీ, షూటింగ్ త్వరగా పూర్తి అయిన ప్రాణం ఖరీదు ముందుగా విడుదల కావడం, ఆయన కెరీర్లో చారిత్రాత్మక మలుపుగా మారింది. దీంతో అభిమానులు సోషల్ మీడియాలో చిరంజీవిపై అభినందనల వర్షం కురిపిస్తున్నారు.
ఇక ఇప్పటికీ అదే ఉత్సాహంతో సినిమాలు చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు మెగాస్టార్. ప్రస్తుతం ఆయన నాలుగు చిత్రాల్లో బిజీగా ఉన్నారు. మన శంకర వరప్రసాద్ గారు – అనిల్ రావిపుడి దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం 2026 సంక్రాంతికి విడుదల కానుంది. విశ్వంభర – దర్శకుడు వశిష్ట తెరకెక్కిస్తున్న ఈ చిత్రం 2026 వేసవిలో ప్రేక్షకులను అలరించ నుంది. వీటితో పాటు శ్రీకాంత్ ఓదెల, బాబీ దర్శకత్వంలో మరో రెండు సినిమాలు లైనప్‌లో ఉన్నాయి.
మొత్తానికి ప్రాణం ఖరీదు తో మొదలైన ప్రయాణం నేడు 47 ఏళ్ల కు చేరుకుంది.ఆయన ప్రతి అడుగు ఒక కొత్త తరానికి ప్రేరణ. అభిమానుల మద్దతుతో ముందుకు సాగుతున్న మెగాస్టార్ రాబోయే ప్రాజెక్టులతో మరిన్ని విజయాలను అందుకోవాలని కోరుకుంటూ, తెలుగు సినీ లోకమంతా ఆనందోత్సాహాలతో శుభాకాంక్షలు తెలుపుతోంది.
22 సెప్టెంబర్ 1978
'కొణిదెల శివ శంకర వరప్రసాద్' అనబడే నేను “ప్రాణం ఖరీదు” చిత్రం ద్వారా 'చిరంజీవిగా' మీకు పరిచయం అయ్యి నేటితో 47 ఏళ్లు దిగ్విజయంగా పూర్తయ్యాయి. ఈ చిత్రం ద్వారా నాకు నటుడిగా ప్రాణం పోసి.., మీ అన్నయ్యగా, కొడుకుగా, మీ కుటుంబ సభ్యుడిగా , ఒక మెగాస్టార్ గా.. అనుక్షణం… pic.twitter.com/1VSVTu9Kkz— Chiranjeevi Konidela (@KChiruTweets) September 22, 2025
తాజావార్తలు
-
Prahaar : సాలిడ్ సక్సెస్ కోసం యంగ్ హీరోపై చాలా నమ్మకం పెట్టుకున్న నిర్మాణ సంస్థ
-
Legendary Director Singeetham Srinivasa Rao : తెలుగు సినిమా ప్రమోగశాల మూతపడింది..
-
Rahul Gandhi: ‘‘రాహుల్ గాంధీ భయపడ్డారు’’.. అఖిలేష్ హామీతో రాయ్‌బరేలీలో పోటీ..
-
Oben Rorr EVO: 180KM రేంజ్.. 8 ఏళ్ల బ్యాటరీ వారంటీ.. దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ బైక్ ఇదే..!
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!