NTV Telugu Site icon

Allu Arjun: షూటింగ్ ఆపేసి మరీ అల్లుడి కోసం రంగంలోకి చిరు

Allu Arjun Chiru

Allu Arjun Chiru

కొద్ది రోజుల క్రితం సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ ని చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాదులోని జూబ్లీహిల్స్ నివాసంలో అల్లు అర్జున్ అరెస్ట్ చేసిన పోలీసులు వైద్య పరీక్షల కోసం గాంధీ హాస్పిటల్ కి తరలించారు. ఆసుపత్రి దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు గాంధీ ఆస్పత్రి లోపల అల్లు అర్జున్ వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. వైద్య పరీక్షల అనంతరం అల్లు అర్జున్ ని నాంపల్లి కోర్టుకు తీసుకువెళ్లి మెజిస్ట్రేట్ ముందు హాజరు పరచనున్నారు. అయితే తన అల్లుడు అరెస్టు అయ్యారన్న విషయం తెలిసిన వెంటనే మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర షూటింగ్ రద్దు చేసుకున్నట్లుగా తెలుస్తోంది.

Allu Arjun: పోలీసుల తీరుపై అసహనం..బట్టలు మార్చుకునే అవకాశం ఇవ్వరా?.

హుటాహుటిన ఆయన బయలుదేరి అల్లు అర్జున్ ని తీసుకు వెళ్లిన చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు బయలుదేరినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి అల్లు అరవింద్, అల్లు శిరీష్ సహా సినీ పరిశ్రమ నుంచి దిల్ రాజు కూడా చేరుకున్నారు. ఇక అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు అన్న వార్త తెలిసిన వెంటనే షూటింగ్ రద్దు చేసుకుని మెగాస్టార్ చిరంజీవి బయలుదేరి వెళ్లడం హాట్ టాపిక్ అవుతుంది. నిజానికి గత కొంతకాలంగా అల్లూ ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ మంచిగ దూరం పెరిగిందని ప్రచారం జరుగుతోంది. అందుకు ఊతమిచ్చేలా ఎన్నో పరిణామాలు కూడా జరిగాయి. కాకుంటే ఇప్పుడు మెగాస్టార్ వెంటనే బయలుదేరి వెళ్లడం మాత్రం ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతుంది.