Site icon NTV Telugu

Prashanth Varma: రాముడిగా మహేష్– హనుమంతుడిగా చిరంజీవి.. ప్రశాంత్ వర్మ ప్లానింగ్ వేరే లెవల్

Chiranjeevi As Hanuman

Chiranjeevi As Hanuman

Chiranjeevi as Hanuman in Jai Hanuman Movie: చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది హనుమాన్ సినిమా. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో తేజ సజ్జ హీరోగా నటించాడు. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి మొదటి సూపర్ హీరో సినిమాగా రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకులందరినీ విపరీతంగా ఆకట్టుకుంది. జనవరి 12వ తేదీన రిలీజ్ అయిన ఈ సినిమా ఇప్పటికే దాదాపు 300 కోట్ల రూపాయలు కలెక్షన్లకు దగ్గర పడింది. అయితే ఈ సినిమా రిలీజ్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన నేపథ్యంలో తాజాగా ప్రశాంత్ వర్మ ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ ఇంటర్వ్యూలో హనుమంతుడి పాత్ర కోసం చిరంజీవి గారిని తీసుకునే అవకాశం ఉందని చెప్పుకొచ్చాడు.

Suriya-Jyothika: విడాకుల ప్రచారం.. రొమాంటిక్ టూర్ కి సూర్య-జ్యోతిక

ముందుగా ఆయనని ఒకసారి కలవాలని పద్మ విభూషణ్ వచ్చిన తర్వాత ఆయన్ని కలవలేక పోతున్నామని అన్నారు. ప్రస్తుతానికి ఆయనని కలిసేందుకు చాలా మంది వెళుతున్న నేపథ్యంలో తనకు ఇప్పుడు వెళ్లి డిస్టర్బ్ చేయడం ఇష్టం లేదని ఆయన ఫ్రీ అయ్యాక వెళ్లి కథ చెబుతానని అన్నారు. ఇక మహేష్ బాబుని రాముడి పాత్రకి పర్ఫెక్ట్ గా ఉంటాడని తాను తీసుకోవాల్సి వస్తే ముందుగా మహేష్ బాబునే సంప్రదిస్తామని ఈ సందర్భంగా ప్రశాంత్ కామెంట్ చేశాడు. అయితే శ్రీ రాముడిగా మహేష్ నటిస్తే చిరంజీవి హనుమంతుడిగా నటిస్తానని ఒప్పుకుంటే మాత్రం ఆ సినిమా ఇక బాక్స్ ఆఫీసు రికార్డులు బద్దలు కొట్టడం ఖాయం అని ట్రేడ్ వర్గాల వారు చెబుతున్నారు.

Exit mobile version