Site icon NTV Telugu

Chiranjeevi : అనిల్ రావిపూడి చిరు మూవీలో మరో మెగా హీరో..!

Chirajeevi Anil Ravipudi

Chirajeevi Anil Ravipudi

చిరంజీవి అనిల్ రావిపూడి కాంబోలో మంచి ఎంటర్‌టైనింగ్ మూవీ తెరకెక్కుతున్నా విషయం తెలిసిందే. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ కాంబినేషన్‌పై ప్రేక్షకుల్లో ఎంతటి ఆసక్తి నెలకొన్నదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అనిల్ ఇప్పటివరకు చేసిన ఎనిమిది సినిమాలు సూపర్ సక్సెస్ లను సాధించడంతో హీరోలకు నిర్మాతలకు అనిల్ పై గట్టి నమ్మకం ఏర్పడింది. అందులోను ఇటీవల ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో సెన్సేషనల్ హిట్ అందుకున్నాడు. దీంతో చిరంజీవి ప్రాజెక్ట్‌పై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. కానీ చిరు ఫ్యాన్స్ ని మెప్పించాలి అంటే అంత చిన్న విషయం కాదు.. అందుకే తీవ్రమైన ప్రయత్నం అయితే చేస్తున్నట్లు తెలుస్తోంది.

Also Read : jackfruit seeds : పనస తొనలు తింటున్నారా.. అయితే జాగ్రత్త

అది కూడా చాలా జాగ్రత్తలు తీసుకుని మరి ఈ సినిమాని సూపర్ డూపర్ సక్సెస్‌గా నిలపాలనే ప్రయత్నంలో ఉన్నారట మూవీ టీం. కాగా అనిల్ రావిపూడి ఈ సినిమాకు సంబంధించిన భారీ కసరత్తులను మొదలెట్టిపన్నటికి, జూన్‌లో షూటింగ్ స్టార్ట్ చేసి జనవరిలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. ఇక ఇప్పటికే ఈ మూవీలో నటీనటుల గురించి చాలా వార్తలు వైరల్ అవుతున్నప్పటికి, తాజాగా మరో థియేటర్ బ్లాస్టింగ్ న్యూస్ వైరల్ అవుతుంది.. ఏంటీ అంటే ఈ సినిమా మీద హైప్ తీసుకురావడానికి రామ్ చరణ్‌ను ఇందులో భాగం చేస్తున్నారట.  ఈ వార్తలో ఎంత వరకు నిజం ఉందో తెలియదు కానీ.. సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Exit mobile version