దేశవ్యాప్తంగా పొంగల్ వేడుకలు ఘనంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇక ఢిల్లీలోని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి నివాసంలో జరిగిన పొంగల్ వేడుకల్లో ప్రధాని మోడీ పాల్గొన్నారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి నివాసంలో ఘనంగా సంక్రాంతి సంబరాలు జరుగగా సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న ప్రధాని మోడీకి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మెగాస్టార్ చిరంజీవి, కేంద్రమంత్రి శ్రీనివాస్ వర్మలు స్వాగతం పలికారు.
Anshu: భూమ్మీదున్న లవ్లీయస్ట్ మ్యాన్ త్రినాథరావు.. ఇక వదిలేయండి!
ఇక ఈ కార్యక్రమానికి స్పీకర్ ఓం బిర్లా, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, కేంద్ర మంత్రులు గజేంద్ర సింగ్ శకావత్, జ్యోతి రాధిత్య సింధియా,మనోహర్ లాలా కట్టర్ , పెమ్మసాని చంద్రశేఖర్,బండి సంజయ్,సతీష్ చంద్ర దూబే, ఎంపీలు లక్ష్మణ్ ,అనురాగ్ ఠాకూర్, ఈటెల రాజేందర్,ధర్మపురి అరవింద్,రఘునందన్ రావు, లక్ష్మణ్,గోడెం నగేష్,బాలశౌరి, కొండ విశ్వేశ్వర్ రెడ్డి , డికే అరుణ ,పలువురు తెలంగాణ బిజెపి నేతలు సహా హీరో తేజ సజ్జా కూడా హాజరయ్యారు. భారతదేశం అంతటా ప్రజలు సంక్రాంతి, పొంగల్‌లను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు.