2024 గానూ ఏయన్నార్ జాతీయ పురస్కార వేడుకల ప్రధానోత్సవం అన్నపూర్ణ స్టూడియోలో అతిరథమహారధుల సమక్షంలో జరుగుతోంది. ఈ ఏడాది అవార్డును మెగాస్టార్ చిరంజీవికి ఇస్తున్నట్లు హీరో నాగార్జున గతంలోనే ప్రకటించగా ఆ పురస్కారం ప్రదానం ఘనంగా జరుగుతోంది. ఈ వేడుకకు బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ ముఖ్య అతిథిగా హాజరవగా ఆయన చేతుల మీదుగానే చిరంజీవికి అక్కినేని జాతీయ పురస్కారాన్ని ప్రదానం చేయనున్నారు. అక్కినేని జాతీయ పురస్కార వేడుకలకు దర్శకులు రాఘవేందర్ రావు, నిర్మాత అశ్వినీదత్, నిర్మాత అల్లు అరవింద్, హీరోలు వెంకటేష్, రామ్ చరణ్, సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ తో పాటు పలువురు నటీమణులు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. చిరంజీవి తల్లి అంజనాదేవి కూడా ఈ వేడుకలకు హాజరవడం గమనార్హం. ఈ సమావేశంలో ఏఎన్‌ఆర్ మాట్లాడిన చివరి ఆడియో సందేశాన్ని వినిపించారు.
Actor Vijay: విజయ్ మా ఐడియాలజీని కాపీ కొట్టాడు.. డీఎంకే, ఏఐడీఎంకే విమర్శలు..
ఫ్యామిలీ గ్రూప్ లో షేర్ చేసిన సదరు ఆడియోలో ఏఎన్‌ఆర్ మాట్లాడుతూ’ నా కోసం మీరు అంతా ఆ దేవుడిని ప్రార్థిస్తున్నారని తెలుసు, మా కుటుంబ సభ్యులు కూడా ఎప్పటికప్పుడు నా ఆరోగ్య సమాచారం గురించి మీకు చెబుతూనే ఉన్నారు. మీ ప్రేమ, అభిమానానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, త్వరలోనే నేను మీ ముందుకు వస్తానన్న నమ్మకం ఉంది. మీరు చూపిన ప్రేమ, అభిమానాలకు ఎప్పటికీ రుణపడి ఉంటా. ఇక సెలవు’ అంటూ చివరిసారిగా ఐసీయూ నుంచి ఆయన సందేశమిచ్చారు. ఇవాళ శతజయంతి వేడుకల్లో నాగేశ్వరరావు మాట్లాడిన ఆడియో సందేశాన్ని వినిపించగా ఇది విని మెగాస్టార్ చిరంజీవి, నటి రమ్యకృష్ణ సహా నాని, సుష్మిత అలాగే ఆ కార్యక్రమానికి హాజరైన అందరూ ఎమోషనలై కంటతడి పెట్టుకున్నారు. ఆ వీడియో వైరల్ అవుతోంది. ఇక తన తండ్రి అక్కినేని నాగేశ్వర రావు స్మారకంగా ప్రతి ఏటా చిత్ర పరిశ్రమకు విశిష్ట సేవలు అందించిన వారికి, హీరో నాగార్జున ఏయన్నార్ స్మారక పురస్కారం ఇస్తున్నారు.