Site icon NTV Telugu

China Piece: ఆసక్తికరంగా ‘చైనా పీస్’ టీజర్

China Piece

China Piece

నిహాల్ కోధాటి, సూర్య శ్రీనివాస్ హీరోలుగా అక్కి విశ్వనాధ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న యూనిక్ స్పై డ్రామా ‘చైనా పీస్’. మూన్ లైట్ డ్రీమ్స్ బ్యానర్ లో తెరకెక్కిన ఈ చిత్రంలో కమల్ కామరాజు, రఘు బాబు, రంగస్థలం మహేష్, శ్రీనివాస్ వడ్లమాని, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్ర పోషించారు. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ మంచి బజ్ ని క్రియేట్ చేసింది. మేకర్స్ ఈ రోజు మేకర్స్ ఈ సినిమా టీజర్ ని రిలీజ్ చేశారు. పీపుల్ స్టార్ సందీప్ కిషన్ టీజర్ లాంచ్ ఈవెంట్ కి ముఖ్య అతిధిగా విచ్చేసి టీజర్ ని లాంచ్ చేశారు. యూనిక్ కాన్సెప్ట్, ప్రెజెంటేషన్‌, యాక్షన్‌, థ్రిల్ ,హ్యుమర్ ఎలిమెంట్స్ తో టీజర్ అదిరిపోయింది.

Also Read : Vishwambhara : కీరవాణి ఉండగా భీమ్స్ తో పాట.. కారణం చెప్పిన వశిష్ట

టీజర్ లాంచ్ ఈవెంట్ లో సందీప్ కిషన్ మాట్లాడుతూ ఈవెంట్ కి రావడానికి కారణం నిహాల్. తను టీజర్ పంపించాడు. నాకు చాలా నచ్చింది. తను సినిమాని ప్రేక్షకుల వద్దకు చేరవేయానే ఆరాటం నాకు చాలా నచ్చింది. తను ఈ వేడుకలో మాట్లాడిన మాటలు కూడా నాకు చాలా నచ్చాయి. ఒక సినిమాను తీసి రిలీజ్ చేయడమే పెద్ద సక్సెస్. ప్రేక్షకులకు సినిమా నచ్చితే అదంతా బోనస్ అని భావించాలి. మన ఆలోచనల్ని దేశం మొత్తం చెప్పడానికి బెస్ట్ ప్రాసెస్ సినిమానే. ఫేమస్ అవ్వాలనుకుంటే రీల్స్ చేసి కూడా ఫేమస్ అవ్వచ్చు. ఇది ఒక స్పై ఫిల్మే కాదు స్పై కామెడీ, సీరియస్ కామెడీ కూడా ఉంది. దర్శకుడు ఈ కథని నమ్మాడు. నమ్మింది చిత్రీకరించాడు నిహాల్ సూర్య వీళ్ళందరిలోనూ ఒక నిజాయితీ ఉంది. తప్పకుండా ఆ నిజాయితీని మనందరం అప్రిషియేట్ చేయాలి. ఒక కొత్త ఫిలిం మేకర్స్ కొత్త నటించినప్పుడు ఆ సినిమాకు వెళ్లి వాళ్ళ ఆలోచన ని చూడడం ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. టీమ్ అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. టీజర్ చాలా బాగుంది. సినిమా కూడా చాలా బాగుంటుందని కోరుకుంటున్నా’ అన్నారు.

Exit mobile version