Chennai Love Story: ‘చెన్నై లవ్ స్టోరీ’ సక్సెస్ మీట్లో ఎమోషన్స్.. రూ.12 కోట్ల ఓపెనింగ్ నుంచి గౌరీ ప్రియపై ప్రశంసల వరద
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chennai Love Story: ప్రేక్షకుల ఆదరణతో విజయవంతంగా ప్రదర్శితమవుతున్న ‘చెన్నై లవ్ స్టోరీ’ చిత్ర బృందం నిర్వహించిన సక్సెస్ మీట్ లో సిబ్బంది మాటలు హైలైట్గా నిలిచాయి. హీరోయిన్ శ్రీ గౌరీ ప్రియ, నిర్మాతలు ధీరజ్ మొగిల్నేని, ఎస్కేఎన్ తమ అనుభవాలను పంచుకుంటూ సినిమాపై ప్రేక్షకులు చూపిస్తున్న ఆదరణకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా హీరోయిన్ శ్రీ గౌరీ ప్రియ మాట్లాడుతూ.. తన జీవితంలో ఇది ఎంతో ప్రత్యేకమైన విజయమని చెప్పారు. సినిమా విడుదలైనప్పటి నుంచి తన ఫోన్ నిరంతరం మోగుతూనే ఉందని, చాలామంది మీ అమ్మ ఉండి ఉంటే చాలా సంతోషించేదని చెబుతున్నారని వెల్లడించారు. అయితే తన అమ్మ ఎక్కడ ఉన్నా తన విజయాన్ని చూస్తూనే ఉంటుందని తాను నమ్ముతున్నానని ఆమె ఎమోషన్ అయ్యారు. ఒక తెలుగు అమ్మాయిగా కంటెంట్ ఉన్న పాత్రలో నటించే అవకాశం రావడం తన అదృష్టమని అన్నారు. సింగిల్ స్క్రీన్లలో వచ్చిన స్పందన ఎలా ఉందో, మల్టీప్లెక్స్లలో కూడా అదే స్థాయి ఆదరణ కనిపిస్తోందని చెప్పారు. ముఖ్యంగా యువతులు తన పాత్రతో కనెక్ట్ అవుతూ పెద్ద సంఖ్యలో మెసేజ్లు పంపుతున్నారని, దీనికి నిర్మాత ఎస్కేఎన్ కారణమని పేర్కొన్నారు.
నిర్మాత ధీరజ్ మొగిల్నేని మాట్లాడుతూ.. సంగీత దర్శకుడు మణిశర్మ అందించిన పాటలు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్రాణం పోశాయని చెప్పారు. అనంత శ్రీరామ్ రాసిన సాహిత్యం కూడా చిత్రానికి మరో బలమైందన్నారు. చిన్నారుల నుంచి పెద్దల వరకు అన్ని వయసుల మహిళలు సినిమాను విశేషంగా ఆదరిస్తున్నారని వెల్లడించారు. దర్శకుడు సాయి రాజేష్ కథ, సన్నివేశాల విషయంలో ఎలాంటి రాజీ పడరని, కొన్ని సందర్భాల్లో కోపంతో ఫోన్లు కూడా పగలగొట్టేవారని నవ్వుతూ చెప్పారు. సెట్లో అందరూ ఆయనను గౌరవంతో పాటు భయంతో కూడా చూసేవారని అన్నారు. గౌరీ ప్రియ పాత్ర కోసం ప్రాణం పెట్టి నటించిందని, అందుకే ఇప్పుడు ఆమెకు అంతటి ప్రశంసలు వస్తున్నాయని చెప్పారు. హీరో కిరణ్ అబ్బవరాన్ని నిజమైన నిర్మాతల హీరోగా అభివర్ణిస్తూ, షూటింగ్ విషయంలో ఎప్పుడూ సహకరించారని వెల్లడించారు.
Also Read
- Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
- Sambaraala Yetigattu Glimpse: మెగా హీరో.. 'సంబరాల ఏటిగట్టు' గ్లింప్స్ మామూలుగా లేదుగా!
- Rahul Sankrityan: ఆ ఆవేశం నుంచే ‘రణబాలి’ పుట్టింది: రాహుల్ సాంకృత్యన్
- Vijay Deverakonda: 'ఏం పనిరా మీ తెల్లొళ్లకి ఈడ'.. బ్రిటీషర్లపై సీమ యాసలో రౌడీ విశ్వరూపం!
నిర్మాత ఎస్కేఎన్ మాట్లాడుతూ… దర్శకుడు సాయి రాజేష్ను దిగ్గజ దర్శకులు భారతీరాజా, భాగ్యరాజ్ స్థాయిలో పోల్చవచ్చని వ్యాఖ్యానించారు. తమ ఇద్దరి ఆలోచనలు భిన్నంగా ఉన్నా, సినిమాపై ఉన్న ప్రేమ తమను ఒక్కటిగా నిలబెట్టిందన్నారు. ప్రతి సినిమాను బాధ్యతగా నిర్మిస్తానని, అందుకే ఒక్కో చిత్రానికి ఎక్కువ సమయం పడుతుందని చెప్పారు. ‘చెన్నై లవ్ స్టోరీ’ తొలి రోజే రూ.12 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి, ‘బేబీ’ సినిమా తొలి రోజు కలెక్షన్ల కంటే సుమారు 30 శాతం ఎక్కువ నమోదు చేసిందని వెల్లడించారు. తమ దృష్టిలో అమ్మాయి ప్రేమ కల్ట్ అయితే, అబ్బాయి ప్రేమ క్లాసిక్ అని చెప్పడానికే ఈ సినిమాను “కల్ట్ క్లాసిక్”గా అభివర్ణిస్తున్నామని ఎస్కేఎన్ వివరించారు. మంచి కంటెంట్ ఇస్తే ఫ్యామిలీ ఆడియన్స్ తప్పకుండా థియేటర్లకు వస్తారని, అందుకు ‘చెన్నై లవ్ స్టోరీ’నే ఉదాహరణగా నిలుస్తోందన్నారు.
అంతేకాకుండా ఇకపై బలమైన మహిళా పాత్రల కోసం దర్శకులు ముందుగా గౌరీ ప్రియనే సంప్రదిస్తారని ధీమా వ్యక్తం చేశారు. దర్శకుడు ఫోన్లపై చూపిన కోపం గురించి తెలుసుకున్న తర్వాత ఆయనకు కొత్త ఫోన్ను బహుమతిగా ఇస్తానని సరదాగా వ్యాఖ్యానించారు. అలాగే తన సినీ ప్రయాణంలో మెగాస్టార్ చిరంజీవికి తాను ఎప్పటికీ రుణపడి ఉంటానని చెప్పారు. సక్సెస్ మీట్లో వచ్చిన ఈ వ్యాఖ్యలు సినిమాపై ప్రేక్షకుల ఆదరణ ఎంత బలంగా ఉందో మరోసారి స్పష్టం చేశాయి. భావోద్వేగ కథ, సంగీతం, నటన కలిసి ‘చెన్నై లవ్ స్టోరీ’ విజయాన్ని మరింత ప్రత్యేకంగా మార్చాయని చిత్ర బృందం అభిప్రాయపడింది.
- Tags
- Chennai Love Story
- cinema
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!