Site icon NTV Telugu

GV Prakash – Saindhavi: జీవీ ప్రకాష్ & సైంధవి ప్రేమ కథకు ముగింపు పలికిన చెన్నై హైకోర్టు..

Gv Prakash And His Wife Saindhavi,

Gv Prakash And His Wife Saindhavi,

నటుడు, సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ 2013లో తన చిన్ననాటి స్నేహితురాలు సైంధవిని వివాహం చేసుకున్నారు. ఈ జంటకు ఒక కుమార్తె ఉంది. వివాహం తర్వాత, జీవీ ప్రకాష్ సినిమాటిక్ కెరీర్‌లో సక్సెస్ సాధించగా, సైంధవి సింగర్‌గా గుర్తింపు సంపాదించుకుంది. కానీ, కొన్ని సంవత్సరాల తర్వాత జంట మధ్య విభేదాలు వచ్చినట్లు వార్తలు వచ్చాయి. వీరు ఈ విభేదాలను సర్దుకోవడానికి ప్రయత్నించినప్పటికీ, వ్యక్తిగత కారణాల వల్ల పరస్పర అంగీకారంతో విడాకు‌ల కోసం నిర్ణయం తీసుకున్నారు.

Also Read : Anushka : ఒకే భాగంగా వస్తున్న ‘బాహుబలి ది ఎపిక్’.. అనుష్క ఎమోషనల్ టాక్

తాజాగా, వీరు విడాకులు తీసుకోవాలని చెన్నై హైకోర్ట్‌లో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌లో, జంట విడాకులు పరస్పర అంగీకారంతో తీసుకోవాలనే అభ్యర్థన తెలిపారు. హైకోర్టు ఈ కేసును విచారించ‌గా, రెండు వైపుల వారి కుటుంబ పరిస్థితుల‌ను బాగా పరిశీలించింది. వీరి కుమార్తె పట్ల సరైన పరిరక్షణ, మద్దతు కల్పించడం, ఆర్థిక వ్యవహారాలపై కూడా హైకోర్టు చర్చలు జరిపింది. ఇవ్వని పరిగణలోకి తీసుకొని, చెన్నై హైకోర్ట్ ఫైనల్‌గా వీరికి విడాకులు మంజూరు చేసింది.

చెన్నై హైకోర్టు తీర్పుతో 2013లో ప్రారంభమైన జీవీ ప్రకాష్ & సైంధవి ప్రేమ కథకు అధికారిక ముగింపు పలికింది. ఇద్దరు కూడా ఈ స్వీకరించారు అని సమాచారం. అంతే కాదు ఈ తీర్పు ద్వారా జీవీ ప్రకాష్ & సైంధవి తమ కుమార్తె భవిష్యత్తులో విషయంలో మాత్రం తల్లిదండ్రులుగా వ్యవహరించాలి అని తేల్చారు. ఇక సినీ పరిశ్రమలో వీరి అనుబంధం, విడాకుల విషయం మీడియా, అభిమానుల మధ్య హాట్ టాపిక్‌గా మారింది.

Exit mobile version