Anushka : ఒకే భాగంగా వస్తున్న ‘బాహుబలి ది ఎపిక్’.. అనుష్క ఎమోషనల్ టాక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్‌లో ఇప్పటి వరకు ఎన్నో భారీ హిట్ చిత్రాలు వచ్చినా తెలుగు సినీ పరిశ్రమకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన చిత్రం ‘బాహుబలి’ అనే చెప్పాలి. ‘బాహుబలి’కి ముందు, తర్వాత అనేలా ఈ చిత్రం ఓ క్లాసిక్‌గా చరిత్రలో నిలిచిపోయింది. రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ , రానా, అనుష్క, తమన్నా ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన బాహుబలి, బాహుబలి 2 చిత్రాలు భారతీయ సినిమా చరిత్రలోనే ఓ మైలురాయిగా నిలిచాయి. ఇందులో దేవసేనగా నటించిన అనుష్క జాతీయ స్థాయిలోనే కాదు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. అమరేంద్ర బాహుబలికి భార్యగా, మహేంద్ర బాహుబలికి తల్లిగా రెండు వేరియేషన్స్‌లో నటించి తనకంటూ సెపరెట్ ఫేమ్ సంపాదించుకుంది. అయితే ఈ రెండు సినిమాలు ‘బాహుబలి ది ఎపిక్’ పేరుతో ఒకే భాగంగా అక్టోబరు 31న విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా ‘బాహుబలి’ఫై స్పందించిన అనుష్క రిలీజ్ టైమ్‌లో తాను సరిగ్గా ఆస్వాదించలేకపోయానని చెప్పుకొచ్చింది.
Also Read : Kantara Chapter 1: ‘కాంతార-1’ నుంచి మరో పాట.. రిలీజ్..
Also Read
అనుష్క మాట్లాడుతూ, “బాహుబలి సినిమాలు విడుదలైనప్పుడు ప్రమోషన్స్‌ని, ఇతర బిజీ షెడ్యూల్‌ల కారణంగా వాటిని పూర్తిగా ఆస్వాదించలేకపోయాము. ఇప్పుడు రెండు సినిమాలు ఒకే భాగంగా మళ్లీ థియేటర్లలో రావడం నాకు చాలా హ్యాపీగా కొత్త అనుభూతిని ఇస్తుంది. ఈసారి ఈ అనుభూతిని ఆస్వాదించాలనుకుంటున్నా” అని పేర్కొన్నారు. కొన్ని నెలల క్రితం నిర్మాత శోభు ‘బాహుబలి ది ఎపిక్’ గురించి చెప్పనప్పుడు చాలా ఆసక్తికరంగా అనిపించిందని చెప్పారు అనుష్క. ప్రస్తుతానికి ఈ ప్రాజెక్ట్ కోసం తెర వెనుక భారీ వర్క్ జరుగుతోందని, ప్రేక్షకులకు ఒక కొత్త సినిమా చూసిన అనుభూతిని మళ్లీ అందించనున్నట్లు ఆమె తెలిపారు.
తాజావార్తలు
-
Veg Omelette: గుడ్డు లేకుండానే గుమగుమలాడే “వెజ్ ఆమ్లెట్”.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు.!
-
AA 23 : అల్లు అర్జున్ – లోకేష్ కనకరాజ్ సినిమా క్యాన్సిల్?
-
Ola Electric Rights Issue: ఓలా ఎలక్ట్రిక్ రైట్స్ ఇష్యూ.. రూ.27కే షేర్లు.. రికార్డ్ డేట్, ప్రారంభ తేదీ వివరాలు ఇవే
-
UPI చార్జీలు వాయిదా పడతాయా? NPCI కీలక నిర్ణయం..!
-
DIGGER : హాలీవుడ్ చరిత్రలోనే అతిపెద్ద డిజాస్టర్లలో ఒకటిగా ‘డిగ్గర్’
ట్రెండింగ్
-
Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?
-
350cc ఇంజిన్, 14.5 లీటర్ల ట్యాంక్, TFT డిస్ప్లేతో Triumph Bonneville T40 లాంచ్.. ధర ఎంతంటే?
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!