Site icon NTV Telugu

Actress Kasturi : మరో వివాదంలో నటి కస్తూరి..

Kasturi

Kasturi

నటి కస్తూరి తీరు తమిళనాడు లో తీవ్ర చర్చినీయాంశంగా మారింది. వరుస వివాదాలతో కస్తూరి వ్యవహారం హాట్ టాపిక్ గా మారుతోంది. రెండు రోజుల క్రితం చెన్నై లోని తెలుగు వారిపై ‘ అప్పట్లో అంతఃపుర మహిళలకు సేవ చేయడానికి వచ్చిన తెలుగు వారు, అలా వచ్చిన వారంతా ఇపుడు తమది తమిళ జాతి అంటూ పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు చేసిన సంగతి తెలిసిందే. అవి కాస్త వివాదానికి దారితీయడంతో తెలుగు నా మెట్టినిల్లు, తెలుగు వారంతా నా కుటుంబం అంటూ వివరణ ఇస్తూనే అధికార డీఎంకే వాళ్లు తనపై కుట్ర చేస్తున్నారని వివరణ ఇచ్చింది.

Also Read : Allu Arjun : పుష్ప – 2 కోసం తమన్ ను ఎందుకు తీసుకున్నారు..?

తాజగా నటి కస్తూరి మరో వివాదంలో చిక్కుకుంది. ఆమె బ్రాహ్మణేతరులపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దూరంరేపుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగుల్లో బ్రాహ్మణేతరులు లంచాలు తీసుకుంటున్నారని కస్తూరి మాట్లాడడాన్ని ఉద్యోగ సంఘాలు ఖండించాయి. నటి కస్తూరి వ్యాఖ్యలు కొన్ని వర్గాలకు చెందిన ప్రభుత్వ ఉద్యోగులపై ప్రజల్లో తప్పుడు అభిప్రాయాన్ని సృష్టిస్తున్నారా అంటూ కస్తూరి పై ఆగ్రహం వ్యక్తం చేసింది తమిళనాడు రెవెన్యూ అధికారుల సంఘం. తమను కించ పరిచేలా మాట్లాడి తమ మనో భావాలను దెబ్బ తీసేలా మాట్లాడిన కస్తూరిపై చర్యలు తీసుకోవాలని తమిళనాడు ప్రభుత్వాన్ని రెవెన్యూ అధికారుల సంగం కోరింది. ఇలా నటి కస్తూరి నిత్యం రోజుకో వివాదంతో విమర్శలపాలవుతుంది. మరోవైపు కస్తూరి తనను కావాలని డీఎంకే పార్టీ నేతలు టర్గెట్ చేసి నేను ఏది మాట్లాడిన వివాదం అయ్యేలా చేస్తున్నారని, తనపై కక్ష గట్టారని వాపోతుంది. ఉద్యోగ సంఘాలపై చేసిన వ్యాఖ్యలను ఎలాంటి వివరణ ఇస్తుందో చూడాలి.

Exit mobile version