Site icon NTV Telugu

Chauryapatam: థియేటర్లో పట్టించుకోలేదు.. ఓటీటీలో లేపుతున్నారు!

Chaurya

Chaurya

అమెజాన్ ప్రైమ్‌లో ప్రస్తుతం ‘చౌర్య పాఠం’ ట్రెండ్ అవుతోంది. థియేటర్లలో రిలీజ్ అయినప్పుడు ప్రేక్షకులు పెద్దగా ఈ సినిమా మీద ఆసక్తి కనబరచలేదు. కానీ ఇప్పుడు ఓటీటీలో మాత్రం జోరు చూపిస్తూ ట్రెండింగ్ లోకి వెళ్ళింది ఈ సినిమా. ఈ క్రైమ్-కామెడీ చిత్రం, ఏప్రిల్ 24, 2025న థియేటర్లలో విడుదలైనప్పుడు ప్రేక్షకుల నుంచి పెద్దగా ఆదరణ పొందలేదు. ఐపీఎల్ వంటి సీజనల్ ఈవెంట్‌లు, పెద్ద సినిమాల రీ-రిలీజ్‌లు దీనికి అడ్డంకిగా నిలిచాయి.

Manchu Manoj: ఒక తెలుగు సినిమాని మరో తెలుగు సినిమాతో చంపేస్తున్నారు

అయితే, ఓటీటీలో విడుదలైన తర్వాత ఈ సినిమా అనూహ్యంగా జోరు చూపిస్తూ ట్రెండింగ్ జాబితాలో చోటు సంపాదించింది. చౌర్య పాఠం సినిమా ఒక బ్యాంకును సొరంగం ద్వారా దోచుకునే నిజ జీవిత ఘటన నుంచి స్ఫూర్తి పొందింది. నిర్మాత త్రినాథ్ రావు నక్కిన ఈ చిత్రాన్ని అత్యున్నత నిర్మాణ విలువలతో తెరకెక్కించారు. సినిమాలో రాజీవ్ కనకాల నటన అందరినీ ఆకట్టుకుంది. ఆయన పాత్రకు జీవం పోసి, ప్రమోషన్‌ల సమయంలో కూడా తన ఉత్సాహాన్ని చాటుకున్నారు. హీరో ఇంద్ర రామ్, హీరోయిన్ పాయల్ రాధాకృష్ణ కెమిస్ట్రీ కూడా బాగుంటుంది.

Exit mobile version