Site icon NTV Telugu

త్రిషకు ఇదే లాస్ట్ బ్యాచిలర్ బర్త్ డే… హీరోయిన్ ట్వీట్ వైరల్

Charmmee Kaur Birth Day Wishes to Trish Goes Viral

త్రిష కృష్ణన్ దక్షిణాదిన స్టార్ గా దశాబ్ద కాలం పాటు కొనసాగిన హీరోయిన్లలో ఒకరు. ఇప్పుడు ఈ చెన్నైచంద్రం త్రిష పెళ్ళి బంధంలోకి అడుగు పెట్టబోతోంది అనే వార్త నెట్టింట వైరల్ గా మారింది. అయితే తాజాగా మరో హీరోయిన్ చేసిన ట్వీట్ తో త్రిష పెళ్లి ఫిక్స్ అయినట్టే అంటున్నారు నెటిజన్లు. ఈరోజు త్రిష పుట్టినరోజు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు ఆమెకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ నేపథ్యంలో త్రిషకు అత్యంత్య సన్నిహితురాలు, హీరోయిన్ ఛార్మి ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. “హ్యాపీయెస్ట్ బర్త్ డే త్రిష. నాకు ఇదే నీ లాస్ట్ బ్యాచిలర్ బర్త్ డే అని బలంగా అన్పిస్తోంది” అంటూ ట్వీట్ చేసింది ఛార్మి. ఇంకేముంది ఛార్మి ఇన్ డైరెక్టుగా త్రిష పెళ్ళిని కన్ఫర్మ్ చేసేసింది. ఛార్మి చేసిన ట్వీట్ త్రిష పెళ్లిపై వస్తున్న పుకార్లకు బలం చేకూరేలా చేసింది. మరి త్వరలో పెళ్లి విషయాన్ని త్రిష త్వరలో ప్రకటిస్తుందేమో చూడాలి. ఇక ఈ 38 ఏళ్ల నటి ఎన్నో చిత్రాల్లో నటించి తన నటనా ప్రతిభతో ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది. ఒకప్పుడు తెలుగు, తమిళ భాషలలో వరుస చిత్రాలతో టాప్ హీరోయిన్‌గా ఉన్న త్రిషకు ఇప్పుడు చాలావరకు అవకాశాలు తగ్గాయి. ప్రస్తుతం ఆమె చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి.

Exit mobile version