సౌత్ హీరోయిన్, నిర్మాత ఛార్మి పెళ్ళికి సిద్ధమైందంటూ తాజాగా సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే తాజాగా ఈ ఛార్మింగ్ బ్యూటీ ఆ వార్తలపై షాకింగ్ రియాక్షన్ ఇచ్చింది. “ఇప్పుడు నా జీవితంలో మంచి దశలో ఉన్నాను. చాలా సంతోషంగా ఉన్నాను. నా జీవితంలో పెళ్లి చేసుకునే తప్పును నేను ఎప్పటికీ చేయను” అంటూ ట్వీట్ చేసి అందరికి షాకిచ్చింది ఛార్మి. ఈ ట్వీట్ చూస్తుంటే ఛార్మికి ఇప్పుడే కాదు అసలు ఎప్పటికీ పెళ్లి చేసుకునే ఉద్దేశమే లేదని తెలిసిపోతోంది. ఒకప్పుడు సౌత్ లో స్టార్ హీరోలందరి సరసన నటించిన దాదాపు దశాబ్దం పాటు స్టార్ హీరోయిన్ గా సత్తా చాటిన ఈ బబ్లీ బ్యూటీకి ఆ తరువాత వరుస పరాజయాలు పలకరించడంతో అవకాశాలు కరువయ్యాయి. జ్యోతిలక్ష్మి, మంత్రం-2 ఆమె హీరోయిన్ గా నటించిన చివరి చిత్రాలు. ‘జ్యోతిలక్ష్మి’లో ఛార్మి నటనకు ప్రశంసలు కురిశాయి. ఇక ఆ తరువాత ఛార్మి నిర్మాతగా టర్న్ తీసుకుంది. ప్రస్తుతం పూరి కనెక్ట్ లో సహనిర్మాతగా ఉంటూ ప్రొడక్షన్ బాధ్యతలు చూసుకుంటోంది. పూరి, ఛార్మి కలిసి చాలా సినిమాలు చేశారు. ఇప్పుడు మాత్రం విజయ్ దేవరకొండతో ‘లైగర్’ చిత్రాన్ని నిర్మిస్తోంది ఈ బ్యూటీ.
పెళ్ళి వార్తలపై ఛార్మి షాకింగ్ రియాక్షన్
