Site icon NTV Telugu

Charmi Kaur: డబుల్ ఇస్మార్ట్ కే పోటీ వస్తారా? రవితేజ, హరీష్ శంకర్లకు ఛార్మి షాక్?

Charmi

Charmi

Charmi Kaur unfollowed Raviteja and Harish Shankar: టాలీవుడ్ లో కొన్ని షాకింగ్ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఆగస్టు 15వ తేదీన అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా రిలీజ్ అవ్వాల్సి ఉంది. కానీ అది డిసెంబర్ కి వాయిదా పడడంతో ఆగస్టు 29వ తేదీన రిలీజ్ అవ్వాల్సిన డబుల్ ఇస్మార్ట్ సినిమాని ఆగస్టు 15వ తేదీకి రిలీజ్ చేయాలని నిర్ణయించారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ హీరోగా ఈ సినిమా ఇస్మార్ట్ శంకర్ సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కింది. నిజానికి డబుల్ ఇస్మార్ట్ అనౌన్స్ చేసేటప్పటికి పెద్ద సినిమాలు కానీ చిన్న సినిమాలు కానీ ఏవి పోటీలో లేవు. కానీ ఇప్పుడు అనూహ్యంగా మిస్టర్ బచ్చన్ సినిమా బరిలో దిగింది. ఒకరకంగా రవితేజ, పూరి జగన్నాథ్ మధ్య చాలా సాన్నిహిత్య సంబంధాలు ఉంటాయి. కానీ పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో సినిమా రిలీజ్ అవుతున్న రోజు రవితేజ హీరోగా చేసిన సినిమాని పోటీకి దింపినట్లు అయింది. అంతేకాక మిస్టర్ బచ్చన్ సినిమా దర్శకుడు హరీష్ శంకర్ కూడా తొలినాళ్లలో పూరి జగన్నాథ్ దగ్గర కొన్ని సినిమాలు పనిచేశాడు.

Payal Radhakrishna: హే పాయల్ పాపా నువ్ కూడా ఇలా జాకెట్ లేకుండా ఫోజులిస్తే ఎలా?

ఒకరకంగా వాళ్ళది గురుశిష్యుల బంధం అనుకోవచ్చు. ఇప్పుడు గురువుతో శిష్యుడు పోటీపడుతున్న పరిస్థితుల్లో డబుల్ ఇస్మార్ట్ సినిమా నిర్మాతలలో ఒకరైన చార్మి కౌర్ హీరో రవితేజ తో పాటు హరీష్ శంకర్ సోషల్ మీడియా హ్యాండిల్స్ ని తన అన్ని సోషల్ మీడియా హ్యాండిల్స్ నుంచి అన్ ఫాలో చేయడం హాట్ టాపిక్ అవుతుంది. నిజానికి డబుల్ ఇస్మార్ట్ సినిమా హిట్ అవటం అనేది రామ్ తో పాటు పూరి జగన్నాథ్ చార్మి వంటి వాళ్ళకి చాలా కీలకం. ఇలాంటి సమయంలో మరో పెద్ద సినిమాని పోటీకి తెచ్చి పెట్టినందుకే వారి పద్ధతి నచ్చక చార్మి కౌర్ అన్ ఫాలో చేసింది ఏమో అని చర్చ అయితే జరుగుతోంది. అయితే నిజానికి మిస్టర్ బచ్చన్ సినిమాని ఆగస్టు 15వ తేదీన రిలీజ్ చేయించడానికి ముఖ్య కారణం ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ తో జరిగిన డీల్ అని తెలుస్తోంది. వాళ్ళ ఒత్తిడి మేరకే సినిమాని ఆగస్టు 15వ తేదీన రిలీజ్ చేస్తున్నారని ప్రచారం టాలీవుడ్ వర్గాల్లో జరుగుతోంది.

Exit mobile version