NTV Telugu Site icon

Charishma Naidu : కన్నడిగులతోనే తెలుగు సీరియల్స్‌, ఇక మనమెందుకు.. నటి చరిష్మా నాయుడు సంచలన ఆరోపణలు

Charishma Naidu

Charishma Naidu

Charishma Naidu Comments on Kannada Artists: కన్నడ సీరియల్స్‌లో నెగిటివ్ లేదా సపోర్టింగ్ రోల్స్ చేసిన వారు లేదా అక్కడ అంతగా పాపులర్ కాని వారు తెలుగు, తమిళం, మలయాళం బుల్లితెరపై మెరుస్తున్నారు. అంతే కాకుండా పలువురు ఆర్టిస్టులు అయితే ప్రస్తుతం కన్నడ సీరియల్స్, తెలుగు సీరియల్స్ లో ఒకేసారి నటిస్తున్నారు. ముఖ్యంగా తెలుగులో కన్నడిగులకు ప్రాధాన్యత ఇస్తున్నారని చెబుతూ దీన్ని తెలుగు నటి చరిష్మా నాయుడు వ్యతిరేకించారు. పవన్ జనసేన పార్టీలో కూడా యాక్టివ్ గా ఉన్న చరిష్మా నాయుడు తాజాగా ఓ ఇంటర్వ్యూలో దీని గురించి మాట్లాడారు. తెలుగు టెలివిజన్‌లో కన్నడ కళాకారులు ఎక్కువగా ఉన్నారు. బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు కళాకారులు విమానంలో వస్తుంటారు ఆ ఖర్చులు తెలుగు నిర్మాతలే భరిస్తున్నారు. వారిని తెచ్చి మంచి పారితోషికం, ఆహార ఖర్చులు -విమాన ఖర్చులు పెట్టుకుంటూ పైపెచ్చు కన్నడిగులకు వసతి ఏర్పాట్లు కూడా తెలుగు నిర్మాతలు చూసుకుంటున్నారు కానీ హైదరాబాద్‌లోని ఆర్టిస్టులకు సీరియల్స్‌లో అవకాశం ఇవ్వడం లేదని ఆమె అన్నారు.

Mirzapur Season 3: మీర్జాపూర్ 3 వచ్చేసింది గురూ!

పారితోషికం కూడా వారితో పోలిస్తే బాలేదు’’ అని చరిష్మా నాయుడు అన్నారు. “తెలుగు టెలివిజన్ ఇప్పుడు కన్నడిగులకు అడ్డాగా మారిపోయింది. తెలుగు సీరియల్స్ లో కన్నడ ఆర్టిస్టులు ఉండడం తప్పు కాదు కానీ అందరూ కన్నడ ఆర్టిస్టులు అయితే ఎలా? ఇప్పుడు అన్ని పాత్రలకు కన్నడ ఆర్టిస్టులు అవసరమా అని ఆమె ప్రశ్నించారు. చరిష్మా నాయుడు మాట్లాడుతూ ఒక తెలుగు సీరియల్‌లో తెలుగు వారు తక్కువ ఉంటారని, మిగిలిన వారు కన్నడిగులే అని అన్నారు. . “తెలుగు వారికి భాష అర్థం అవుతుంది, కన్నడ కళాకారులు ఎలా మాట్లాడినా డబ్బింగ్ చెప్పుకుని మరీ లిప్ సింక్ సరిగా లేకపోయినా కన్నడ నటీనటులు నటన మాత్రం బాగుందని అంటున్నారు. అదే తెలుగు వాళ్ళు ఎలా నటించినా బాగుండదని అంటున్నారు.

తెలుగులో ఆర్టిస్టులుగా ఉండడమే మన తప్పా? మన దగ్గర చాలా మంది ఆర్టిస్టులు అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. అయితే ఎవరికీ అవకాశం ఇవ్వడం లేదు. బెంగళూరు కళాకారులకు తెలుగులో అవకాశాలు లభిస్తాయి. మరి మనం తెలుగువాళ్ళం ఏం చేయాలి? అని చరిష్మా నాయుడు ప్రశ్నించారు. తెలుగులో అన్ని సాంకేతిక వర్గాలకు ఒక యూనియన్ ఉంది కానీ సీరియల్స్ ఆర్టిస్టులకే లేదని చరిష్మా నాయుడు అన్నారు. అయితే ఇదే విషయం మీద కొంతమంది కన్నడ ఆర్టిస్టులను ప్రశ్నిస్తే “కన్నడలో ఎక్కువ రెమ్యునరేషన్ లేదు. ఒక సీరియల్ హిట్ అయిన తర్వాత అంత త్వరగా మరో సీరియల్ లో నటించే అవకాశం రాదు. కానీ తెలుగులో మాత్రం ఆర్టిస్టులకు మంచి పారితోషికం, ప్రయాణ ఖర్చులు, ఆహార ఖర్చులు ఇస్తారు. అక్కడ కన్నడ కళాకారులను దేవుళ్లలా చూస్తారు’’ అని కామెంట్ చేశారు.