Ee Paata Korinavaaru : ఇండియన్ సినీ హిస్టరీలోనే అత్యంత పొడవైన టైటిల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతీయ సినీ చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో ఒక సినిమా టైటిల్ ఏకంగా ఒక వాక్యం అంత పొడవుతో సంచలనం సృష్టిస్తోంది. ‘ఆ నలుగురు’, ‘మధుమాసం’, ‘అందరి బంధువయా’ లాంటి ఎమోషనల్ అండ్ మీనింగ్‌ఫుల్ చిత్రాలను అందించిన విలక్షణ దర్శకుడు చంద్ర సిద్ధార్థ్ తాజాగా ఒక సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. ఫిల్మోత్సవ్ బ్యానర్‌పై ఆయన స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ సైకలాజికల్ థ్రిల్లర్‌కు “ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు” అనే అత్యంత భారీ టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ చిత్రానికి ‘ఎ ఫర్బిడెన్ రాగ ఫ్రమ్ ఎ ఫర్బిడెన్ సాగా’ అనేది ఉపశీర్షిక.
ఇదొక మొట్టమొదటి మిస్టరీ మ్యూజికల్ థ్రిల్లర్. గతంలో తన కథతో ‘ఆ నలుగురు’ లాంటి క్లాసిక్‌ను అందించిన ప్రముఖ దివంగత దర్శక రచయిత మదన్.. చనిపోవడానికి ముందు ప్లాన్ చేసుకున్న చివరి ప్రాజెక్ట్ ఇది. ఆ స్నేహంతోనే చంద్ర సిద్ధార్థ్ ఈ అరుదైన కథను ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. కథ విషయానికి వస్తే.. ప్రతిరోజూ రాత్రి కచ్చితంగా పదిన్నర గంటలకు ఒక రేడియో స్టేషన్ నుంచి ఒకే పాట ప్రసారం అవుతుంటుంది. ఆ పాటను కోరేది మాత్రం నెమలిపాలెంకు చెందిన రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి తదితరులు. అసలు వీరంతా ఎవరు? రోజూ ఒకే టైమ్‌కి ఆ పాటే ఎందుకు అడుగుతున్నారు? అనే ఆసక్తికరమైన పాయింట్ చుట్టూ కథనం సాగుతుంది.
Also Read
- Mahaveer Karna: కర్ణుడిగా లారెన్స్ లుక్ అదిరింది.. కానీ దానవీర కర్ణుడిని ఇలా చూపిస్తారా?
- Hero's As Directors : హిట్టు కోసం తమ సినిమాలు తామే తీసుకుంటున్న టాలీవుడ్ హీరోలు..
- Raghav Juyal: 'ది ప్యారడైజ్' ఈవెంటా.? లేక రాఘవ్ జుయల్ డ్యాన్స్ షోనా..? డాన్స్‌తో అదరగొట్టేసాడుగా.!
- Radha vs Ambika: అబద్ధాలాడుతోంది, నేను కూడా ఫిర్యాదు చేస్తా.. రాధాకు అంబిక వార్నింగ్!
కేవలం సస్పెన్స్ మాత్రమే కాకుండా.. ధ్వని (సౌండ్ థెరపీ), న్యూరోసైన్స్, బ్రెయిన్ మ్యాపింగ్, జ్ఞాపకాలు, మనిషిలోని అపరాధ భావన (గిల్ట్) వంటి సరికొత్త సైకలాజికల్ అంశాలను ఈ సినిమాలో మేళవించారు. సంగీతానికి అత్యంత ప్రాధాన్యత ఉన్న ఈ హై-కాన్సెప్ట్ చిత్రంతో ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని ఇవ్వబోతున్నట్లు దర్శకుడు చంద్ర సిద్ధార్థ్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. పూర్తిస్థాయి ప్రయోగాత్మకంగా వస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 18న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
తాజావార్తలు
-
Mahaveer Karna: కర్ణుడిగా లారెన్స్ లుక్ అదిరింది.. కానీ దానవీర కర్ణుడిని ఇలా చూపిస్తారా?
-
India vs Japan: ఓడిపోతాం అనుకున్నా.. అతడే గట్టెక్కించాడు.. శ్రేయస్ అయ్యర్ కీలక వ్యాఖ్యలు!
-
సిటీ ప్రయాణాలకు బెస్ట్ ఛాయిస్.. ఫాస్ట్ ఛార్జింగ్.. 145 కి.మీ రేంజ్.. అదిరిపోయే ఫీచర్లలతో Honda QC3 రిలీజ్..
-
Crude Prices: పెట్రో బాం*బ్! నిత్యావసర ధరలు పెరుగుతాయా?
-
Explainer: వృద్ధాప్యంలో వచ్చే సమస్యలు చిన్నతనంలోనే.. షాకింగ్ స్టడీ!
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!