ప్రముఖ గాయనీ సెలెనా గోమెజ్ ‘లూపస్’ అనే దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతోంది. ఇది ఉన్న వారిలో తమ స్వంత రోగ నిరోధక శక్తే వ్యతిరేకంగా పని చేస్తుంది. ఆరోగ్యవంతమైన కణాల్ని కూడా నాశనం చేసేస్తుంది. ఫలితంగా ‘లూపస్’ వ్యాధి ఉన్న వారికి ఇన్ ఫ్లమేషన్, స్వెల్లింగ్ తో పాటూ కీళ్లు, మూత్ర పిండాలు, రక్తం, గుండె, ఉపిరితిత్తుల సంబంధమైన సమస్యలు పదే పదే వస్తుంటాయి.
హాలీవుడ్ లో మంచి గుర్తింపు సంపాదించుకున్న చార్లీ షీన్ హెచ్ఐవీ షేపెంట్. ఈ వ్యాధి కూడా రోగ నిరోధక శక్తికి సంబంధించినదే. ఇమ్యూనిటీ తగ్గిపోవటం వల్ల హెచ్ఐవీ రోగులకి అనేక ఇతర వ్యాదులు తేలిగ్గా సంక్రమిస్తుంటాయి…
హగ్ జాక్ మాన్ 2013 నుంచీ ఇప్పటి వరకూ 4 సార్లు స్కిన్ క్యాన్సర్ కి ట్రీట్మెంట్ తీసుకున్నాడు. ‘బాసల్ సెల్ కార్సినోమా’ పేరుతో పిలిచే ఈ వ్యాధి రకరకాల క్యానర్లలో విరివిగా కనిపించేదే. అయితే, శాశ్వత వైద్యం మాత్రం లేదు.
మైఖెల్ జే ఫాక్స్ 25 ఏళ్లుగా పార్కిన్సన్స్ డిజీజ్ తో బాధపడుతున్నాడు. చాలా మంది పార్కిన్సన్స్ వ్యాధి సోకితే ఇక జీవితం ముగిసినట్టే అనుకుంటారు. మైఖెల్ మాత్రం రోగాన్ని సవాలు చేస్తూ పాతికేళ్లుగా ముందుకు సాగుతున్నాడు…
‘టాచీకార్డియా’ అనే హృదయ సంబంధమైన వ్యాధితో పోరాడుతోంది నటీ మిలీ సైరస్. అది ఉన్న వారి గుండె మామూలు వారికంటే వేగంగా కొట్టుకుంటుంది. అందువల్ల కొన్నిసార్లు ఊపిరి తీసుకోవటం కష్టమైపోతుంది. ‘టాచీకార్డియా’కు కూడా పర్మనెంట్ క్యూర్ అంటూ ఏదీ లేదు…
పమేలా అండర్సన్ కు ‘హెపటైటిస్ సీ’ వ్యాధి వల్ల తీవ్రమైన కడుపు నొప్పి వస్తుంటుంది. ఈ వ్యాధికి సైతం తాత్కాలిక ఉపశమనాలే తప్ప శాశ్వత పరిష్కారం లేదు. దీర్ఘకాలంలో హెపటైటిస్ సీ వల్ల లివర్ ప్రమాదానికి గురవుతుంది…
జాన్ హామ్ జొనాథన్ అనే హాలీవుడ్ నటుడికి ‘విటిలిగో’ వ్యాధి ఉంది. దీని వల్ల శరీరంపై తెల్ల మచ్చలు, ఛారలు వస్తాయి. అవి మళ్లీ పోవటం అంటూ సాధ్యం కాదు…
ప్రఖ్యాత హాలీవుడ్ స్టార్ టామ్ హాంక్స్ టైప్ 2 డయాబిటిస్ పేషెంట్.
కిమ్ కర్ధాషియన్ కు సోరియాసిస్ ఉంది. దాని వల్ల శరీరంపై దురదతో కూడిన మచ్చలు ఏర్పడతాయి. పర్మెనెంట్ క్యూర్ అంటూ లేని సోరియాసిస్ కొన్నాళ్లు తీవ్రంగా ఇబ్బంది పెడుతూ… మళ్లీ కొన్నాళ్లు గ్యాప్ ఇస్తూ… తిరిగి వచ్చేస్తుంటుంది. సరైన మందులు, వైద్యం ఇంత వరకూ లేవు!