NTV Telugu Site icon

Sri Reddy: శ్రీరెడ్డిపై పోలీస్ కేసు

Sri Reddy

Sri Reddy

తూర్పుగోదావరి జిల్లాలో నటి శ్రీరెడ్డిపై పోలీస్ కేసు నమోదు అయింది. శ్రీరెడ్డిపై రాజమండ్రి బొమ్మూరు పి.ఎస్.లో టీడీపీ రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి, మాజీ కార్పొరేటర్ మజ్జి పద్మ ఫిర్యాదు చేశారు. వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, వంగలపూడి అనితలపై చేసిన వ్యాఖ్యలకు శ్రీ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. మజ్జి పద్మ ఫిర్యాదు మేరకు బొమ్మూరు పి.ఎస్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలు పెట్టారు. ఇక నిజానికి ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో ఇప్పుడు సోషల్ మీడియా పోస్టులు కాకరేపుతున్నాయి.

Winter: ఈ చిట్కాలతో చలి నుంచి బయటపడండి

ఇదే సమయంలో.. కేసులు, అరెస్ట్‌లు జరుగుతున్నాయి.. అయితే, అధికార కూటమి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని టార్గెట్‌ చేసి అరెస్ట్‌లు చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. వైసీపీ హయాంలో సోషల్ మీడియాలో అభ్యంతరకర, అనుచిత పోస్టులు పెట్టిన వారిపై కూటమి నేతలు ఫిర్యాదులు చేస్తుండటంతో ఇప్పటికే 57 మంది వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై కేసులు నమోదయ్యాయి. తాజాగా సినీ దర్శకుడు రాంగోపాల్‌ వర్మ(ఆర్జీవీ), నటుడు పోసానిపైనా ఫిర్యాదు చేశారు. ప్రకాశం జిల్లా మద్దిపాడు పీఎస్‌లో రాంగోపాల్ వర్మపై పోలీసులకు ఫిర్యాదు చేయగా గుంటూరు జిల్లా తుళ్లూరు పోలీస్‌ స్టేషన్‌లో టీడీపీ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక రామ్ గోపాల్ వర్మకి పోలీసులు నోటీసులు కూడా జారీ చేశారు.