Cannes 2026: కేన్స్ ఫెస్టివల్‌లో దేశీ గ్లామర్ షో.. ఖర్చులు చూసి షాక్ అవుతున్న నెటిజన్లు!

Cannes 2026

Cannes 2026

ఫ్రెంచ్ రివేరా వేదికగా జరిగే ఈ అంతర్జాతీయ వేడుకలో భారత్ ప్రాతినిధ్యం ఈ ఏడాది సరికొత్త స్థాయికి చేరనుంది. మే 11 నుంచే మన దేశీ తారల ప్రయాణం మొదలవ్వగా, వారు ధరించే దుస్తులు, అలంకరించుకునే ఆభరణాల ధరలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. గ్లోబల్ బ్రాండ్లు తమ ప్రచారంలో భాగంగా ఈ తారల కోసం కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నాయి.

అంతర్జాతీయ ఫ్యాషన్ ప్రమాణాలకు అనుగుణంగా తారలు ధరించే ఒక్కో డిజైనర్ గౌను ధర రూ. 1.5 కోట్ల నుంచి రూ. 5 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఇక ఆభరణాల విషయానికొస్తే, వాటి విలువ వందల కోట్లు దాటుతుంది. ముఖ్యంగా వింటేజ్ డైమండ్స్, అరుదైన వజ్రాలతో కూడిన నెక్లెస్‌లు ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ఆలియా భట్, అదితి రావు హైదరీ వంటి వారు భారతీయ వారసత్వానికి ఆధునిక టచ్ ఇచ్చేలా తమ లుక్స్‌ను ప్లాన్ చేసుకున్నారు.

కేన్స్‌లో తారలు బస చేసే హోటళ్లు కూడా అత్యంత ఖరీదైనవి. చాలామంది భారతీయ నటీమణులు ‘గ్రాండ్ హయత్ కేన్స్ హోటల్ మార్టినెజ్’ (GHCHM)లో బస చేస్తారు. ఇక్కడి లగ్జరీ సూట్లలో ఒక్క రాత్రి బసకు రూ. 40 లక్షల వరకు ఖర్చవుతుందని సమాచారం. స్టైలిస్టులు, మేకప్ ఆర్టిస్టులు, ఇతర సిబ్బంది కోసం అయ్యే ఖర్చంతా అంతర్జాతీయ లగ్జరీ బ్రాండ్లే భరిస్తాయి. ఇది కేవలం సినిమాల పండుగ మాత్రమే కాదు, ప్రపంచ వేదికపై ఒక పెద్ద మార్కెటింగ్ వేదికగా కూడా ఉపయోగపడుతుంది.