Pooja Hegde : 18 ఏళ్ల వయసులో స్టార్ హీరోయిన్ పూజాహెగ్డే ఇలా ఉందేంటి

Pooja Hegde Old Video

Pooja Hegde Old Video

టాప్‌ బ్యూటీ పూజా హెగ్డేకు సంబంధించిన ఒక పాత వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా హల్‌చల్ చేస్తోంది. 18 ఏళ్ల వయసులో ఫెమినా మిస్ ఇండియా పోటీల్లో పాల్గొన్న సమయంలో తీసిన వీడియో అది. అందులో తనను తాను ముంబైకి చెందిన అమ్మాయిగా పరిచయం చేసుకుంది పూజ. కానీ పూజా కర్ణాటక నుండి వచ్చింది. ఆ సంగతి అలా ఉంచితే ఆ విడీలో చాలా బక్కపలుచగా, అమాయకమైన రూపంతో కనిపిస్తున్న పూజాను చూసి అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

అసలు ఆ వీడియోలో ఉంది పూజా హెగ్డేనేనా అనే ఫీలింగ్ కలగక మానదు. కాగా మోడలింగ్ రంగంలో తన పయనాన్ని ప్రారంభించిన పూజా హెగ్డే, అక్కినేని నాగచైతన్య సరసన నటించిన ఒక లైలా కోసం సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. మొదటి సినిమాతోనే తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకోగలిగింది. ఆ తర్వాత తక్కువ కాలంలోనే ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్, మహేశ్ బాబు, ప్రభాస్ వంటి స్టార్ హీరోల సరసన వరుస అవకాశాలు అందుకుంటూ టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారారు. అనేక సూపర్‌హిట్ చిత్రాల్లో నటించి అగ్ర కథానాయికగా తనదైన ముద్ర వేశారు. ప్రస్తుతం ఆమెకు సంబంధించిన ఈ పాత రేర్ వీడియో నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. గత కొంత కాలంగా టాలీవుడ్ కు దూరమైన పూజా లాంగ్ గ్యాప్ తర్వాత శర్వానంద్ సినిమాతో ర ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతోంది.