NTV Telugu Site icon

Tollywood : అనుకున్నట్టుగానే ఆ సినిమాకు ‘A’ సర్టిఫికెట్..

C 200

C 200

మైటీ ఒక్ పిక్చర్స్ బ్యానర్ పై మనోహరి కె ఎ నిర్మాతగా మున్నా కాశీ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న హర్రర్ థ్రిల్లర్ చిత్రం ‘సి 202’. ఈ చిత్రంలో తనికెళ్ళ భరణి, శుభలేఖ సుధాకర్, సత్య ప్రకాష్, షఫీ, చిత్రం శీను, వై విజయ, అర్చన ప్రధాన పాత్రల్లో నటించారు.

ఇది మంచి కంటెంట్ ఉన్న డిఫరెంట్ కాన్సెప్ట్ కథ. ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాకు సెన్సార్ సభ్యులు  ‘ఎ’ సర్టిఫికెట్ జారీ చేశారు. కాగా  అక్టోబర్ 25 న గ్రాండ్ గా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రంలో మున్నా కాశీ సరసన గోవా బ్యూటీ షారోన్ రియా ఫెర్నాండెజ్ హీరోయిన్‌గా నటించింది. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్లు, టీజర్, ట్రైలర్ ఇలా అన్నీ కూడా ప్రేక్షకుల్లో అంచనాలు పెంచేశాయి. ట్రైలర్‌లో ఒక్క డైలాగ్ కూడా లేకుండా.. కేవలం నటీనటుల హావభావాలతోనే అందరినీ ఆకట్టుకున్నారు. సౌండ్ ఎఫెక్ట్స్, కెమెరా వర్క్ ఈ చిత్రానికి ప్రధాన బలం అని ట్రైలర్ చూస్తే అందరికీ అర్థం అవుతుంది.

ఇక ఇలాంటి టెక్నికల్ బ్రిల్లియెన్స్‌తో తీసిన చిత్రాన్ని ఆడియెన్స్ కచ్చితంగా ఆదరిస్తారు. తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. సెన్సార్ సభ్యులు ‘ఎ’ సర్టిఫికెట్ ఇచ్చి సినిమా బాగుంది అని కొనియాడారు. అక్టోబర్ 25న విడుదల అవుతుంది. ఈ చిత్రంలో  మున్నా కాశీ, షారోన్ రియా ఫెర్నాండెజ్, సీనియర్ నటులు తనికెళ్ళ భరణి, శుభలేఖ సుధాకర్, సత్య ప్రకాష్, షఫీ, చిత్రం శీను, వై విజయ, అర్చన తదితరులు నటిస్తున్నారు.