BVS Ravi: బాలయ్య ‘అన్‌స్టాపబుల్’ సీక్రెట్ బయటపెట్టిన బి.వి.ఎస్. రవి! అసలు విషయం ఇదే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BVS Ravi: టాలీవుడ్లో వైవిధ్యమైన కథలతో, మాటలతో తనదైన ముద్ర వేసుకున్న రచయిత, దర్శకుడు బి.వి.ఎస్.రవి ఇటీవల ఎన్టీవీ పాడ్‌కాస్ట్ షోలో పాల్గొని పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. తెలుగు ఓటీటీ రంగంలో సరికొత్త రికార్డులు సృష్టించి, టాప్ టాక్ షోగా దూసుకుపోతున్న నందమూరి బాలకృష్ణ ‘అన్‌స్టాపబుల్’ (Unstoppable) షో వెనుక ఉన్న ఆసక్తికరమైన విషయాలను ఈ పాడ్‌కాస్ట్‌లో ఆయన బయటపెట్టారు. అసలు ఈ షో ఐడియా ఎవరిదో? బాలకృష్ణ సెట్స్‌పై ఎలా ఉంటారు అనే విషయాలను పంచుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాలకృష్ణ గారితో ఒక వినూత్నమైన టాక్ షో చేయాలనే ఆలోచన మొదట ప్రముఖ నిర్మాత, ‘ఆహా’ అధినేత అల్లు అరవింద్ గారికి వచ్చిందని అన్నారు. ఈ విలక్షణమైన ప్రాజెక్ట్ కోసం తాను కూడా ఒక రైటర్‌గా టీమ్‌లో చేరానని వివరించారు. బాలయ్య బాబు ఇమేజ్‌కు సరిపోయేలా, ఆయనలోని సరికొత్త కోణాన్ని ప్రేక్షకులకు చూపించాలనే లక్ష్యంతోనే ఈ షోను డిజైన్ చేసినట్లు వెల్లడించారు. బాలకృష్ణ గారి వర్కింగ్ స్టైల్ – ఎనర్జీ లెవెల్స్ గురించి ఆయన మాట్లాడుతూ ఆశ్చర్యకరమైన విషయాలను చెప్పారు. “బాలయ్య బాబు ఎనర్జీ సామాన్యమైనది కాదు. ఆయన ఉదయం 5:30 గంటలకే సెట్స్‌కు వచ్చేస్తారు. అక్కడ నుండి రాత్రి 7:30 గంటల వరకు నాన్‌స్టాప్‌గా, అదే ఎనర్జీతో షూటింగ్లో దూసుకుపోతారు” అని ఆయన కొనియాడారు. వయసుతో సంబంధం లేకుండా బాలకృష్ణ చూపిస్తున్న ఈ అంకితభావం, ఎనర్జీనే ‘అన్‌స్టాపబుల్’ షో ఇంతటి ఘనవిజయం సాధించడానికి ప్రధాన కారణమని స్పష్టం చేశారు.
Also Read
- Balakrishna - Koratala Siva: కొరటాల మూవీలో మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్.. ఒకే ఫ్రేమ్‌లో ఇద్దరు బాలయ్యలు!
- Mega Podcast: దశాబ్దం తర్వాత డిజిటల్ స్క్రీన్‌పై మెగా హోస్టింగ్.. ఆ రెమ్యునరేషన్ లెక్కలు ఏంది బాస్!
- Suriya: స్టేజ్‌పై డైరెక్టర్ రాజమౌళికే స్వీట్ షాక్ ఇచ్చిన స్టార్ హీరో సూర్య! వైరల్ అవుతున్న వీడియో...
- Ranabali Documentary: కథపై హైప్ పెంచుతుందా? ఆసక్తిని చంపేస్తుందా?.. రణబాలి డాక్యుమెంటరీ స్ట్రాటజీపై హాట్ డిబేట్!
తాజావార్తలు
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
-
OTR : El Ninoతో మరణమృదంగమేనా ? లక్షల మంది పిట్టల్లా రాలిపోతారా ?
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!