Site icon NTV Telugu

Butchi Babu: బుచ్చిబాబకు మాటిచ్చిన మహేశ్ బాబు..!

Mahesh Babu Buchi Babu

Mahesh Babu Buchi Babu

రామ్ చరణ్‌ హీరోగా, బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ ‘పెద్ది’. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా.. జగపతిబాబు, కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్, బాలీవుడ్ నటుడు దివ్యేండు సహా పలువురు నటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్‌ రెహమాన్‌ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండగా, మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్‌ రైటింగ్స్‌, వృద్ధి సినిమాస్ సంస్థలు నిర్మిస్తున్నాయి. వచ్చే ఏడాది మార్చి 27న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. అయితే మరి ‘పెద్ది’ తరవాత బుచ్చిబాబు ఏం చేయబోతున్నాడు అనే టాపిక్‌ ఇప్పుడు ట్రెండ్ అవుతుంది.

Also Read:  Sriram : ప్రముఖ కొరియోగ్రాఫర్ మృతి..

తాజా సమాచారం ప్రకారం ‘పెద్ది’ అయ్యాక బుచ్చిబాబు మహేష్‌ బాబుతో సినిమా చేయబోతున్నారట. వినడానికి షాకింగ్ గా ఉంది కదా.. దీనికి కారణం సుకుమార్‌  అని టాక్. మహేశ్ తో ‘వన్‌’ సినిమాకు బుచ్చి అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పని చేశాడు. ఆ సమయంలో మహేశ్ తో సాన్నిహిత్యం ఏర్పడిందట. ‘ఉప్పెన’ తరవాత కూడా మహేశ్ ను బుచ్చి కలిసిన సందర్భంలో  ‘మంచి కథ ఉంటే చెప్పు, చేద్దాం’ అని మాట ఇచ్చాడట మహేశ్. ఇప్పుడు మహేశ్ కోసం ఓ కథ సిద్థం చేసై పనిలో ఉన్నాడట బుచ్చిబాబు. ఓ యాక్షన్‌ డ్రామాను రెడీ చేసి  మహేశ్ ను  నెక్ట్స్‌ లెవల్‌లో చూపించే ప్రయత్నాల్లో బుచ్చిబాబు ఉన్నాడని ఫిల్మ్‌నగర్‌ టాక్‌. ఇక ప్రస్తుతం మహేశ్ ‘ఎస్‌ఎస్‌ఎంబీ29’ మూవీతో బిజీగా ఉన్నారు. ఈ ప్రాజెక్ట్‌ పూర్తి కావడానికి మరో రెండు, మూడేళ్లు పడుతుంది. ‘పెద్ది’ కూడా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. రాజమౌళి సినిమా కంప్లిట్ అవ్వగానే బుచ్చిబాబు సినిమా ట్రాక్‌లోకి వచ్చే ఛాన్స్ ఉందేమో చూడాలి.

Exit mobile version