తండేల్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో నిర్మాత బన్నీ వాసు నాగచైతన్య గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. నిజానికి ప్రతి సినిమాకి యూనిట్లో ఒకరికి ఆ సినిమా మీద గట్టి నమ్మకం ఉంటుంది. ఒకరు చాలా గట్టిగా కోరుకుంటారు, ఒకరు చాలా బాగా కష్టపడతారు. వాళ్ళ ఎనర్జీకి సినిమా 50% సక్సెస్ అయిపోతుంది. ఈ సినిమాకి హిట్ అవ్వాలి పెద్ద హిట్ అవ్వాలి అని మా అందరికన్నా గట్టి కసి నాగచైతన్య గారికి ఉంది. కచ్చితంగా ఈ సినిమా చైతన్య గారి కెరియర్ లోనే బిగ్గెస్ట్ సినిమా అవుతుంది. ఆయనలో నేను ఆ కసి చూశాను. మేమందరం ఎలా ఉన్నా కూడా ఈ సినిమాలో ఆయన ఎనర్జీ పట్టికెళుతుంది ఈ సినిమాని.
Naga Chaitanya: అసలైన బుజ్జి తల్లి శోభితే.. కానీ ఆ విషయంలో చాలా ఫీల్ అయింది!
ఖచ్చితంగా సినిమా చూసి బయటికి వచ్చే వాళ్ళందరూ చైతన్య నటన గురించే మాట్లాడతారు.. ఎందుకంటే ప్రతి నటుడి కెరీర్ లో ఒక సినిమా ఉంటుంది. అల్లు అర్జున్ గారికి జులాయి సినిమా తర్వాత ఆయన నటనలో ఒక టర్నింగ్ పాయింట్. అదేవిధంగా చైతన్య గారికి ఈ తండేల్ సినిమా నటన విషయంలో టర్నింగ్ పాయింట్ . ఎందుకంటే నేను సినిమా చూసిన వ్యక్తిగా చెబుతున్నాను. నాగచైతన్య గారు, మీరు ఈ సినిమాలో నటనలో మీ బౌండరీ దాటేశారు కచ్చితంగా బయటికి వచ్చేటప్పుడు మీ గురించి అయితే మాట్లాడుకుంటారు అంటూ ఆయన చెప్పుకొచ్చారు.