యూత్‌ఫుల్ కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్ల మిశ్రమంగా రూపొందిన చిత్రం ‘బన్ బటర్ జామ్’. రాజు జేయ మోహన్, ఆధ్య ప్రసాద్, భవ్య త్రిఖ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి రాఘవ్ మిర్దత్ దర్శకత్వం వహించారు. తమిళంలో సూపర్ హిట్‌గా నిలిచిన ఈ సినిమా ఇప్పుడు తెలుగులో విడుదలకు సిద్ధమైంది. శ్రీ విఘ్నేశ్వర ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సిహెచ్ సతీష్ కుమార్ ఆగస్టు 22న ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నారు.
Also Read : Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం ‘కె ర్యాంప్’ నుంచి ఫస్ట్ సింగిల్ ‘ఓనమ్’కు డేట్ ఫిక్స్..!
తాజాగా విడుదలైన ట్రైలర్‌తో సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ‘సంపాదించిన దాంట్లో సగం పెళ్లికి ఖర్చు.. మిగతా సగం డైవర్స్‌కి ఖర్చు’ అనే డైలాగ్‌తో ప్రారంభమైన ట్రైలర్, నేటి జనరేషన్ రిలేషన్‌షిప్స్‌ను కామెడీగా చూపిస్తూ ఆసక్తిని కలిగించింది. ప్రేమలో ఉన్న యువత, వారి భావోద్వేగాలు, తల్లిదండ్రుల అభిప్రాయాలు, వివాహం – డైవోర్స్ వంటి అంశాల్ని చక్కగా మేళవించి ట్రైలర్‌ను కట్ చేశారు. కాలేజ్ లైఫ్, ఫస్ట్ లవ్, పెళ్లి, మనస్పర్ధాలు, తల్లిదండ్రుల ఒత్తిళ్లు వంటి విషయాలను హాస్యంతో ప్యాకేజ్ చేసినట్టు ఈ ట్రైలర్ చెబుతోంది. ట్రైలర్ చివర్లో తల్లి చెప్పే.. ‘‘మీ జనరేషన్‌ను అర్థం చేసుకునే ప్రయత్నం ఓడిపోతున్నాం’’ అనే డైలాగ్ ఈ కథలోని ఎమోషన్‌ని స్పష్టం చేస్తోంది. తమిళంలో విజయం సాధించిన ఈ కామెడీ ఎంటర్‌టైనర్ ఇప్పుడు తెలుగులో కూడా అలరిస్తుందన్న నమ్మకంతో ఆగస్టు 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఫన్, లవ్, ఫ్యామిలీ ఎలిమెంట్స్ కావాలనుకునే ప్రేక్షకులకు ఇది మంచి ఎంటర్‌టైనర్‌గా నిలవనుంది.
