NTV Telugu Site icon

Kalki 2898 AD : ముంబై పోలీసుల చేతిలో బుజ్జి ..వీడియో వైరల్..

Bujji

Bujji

Kalki 2898 AD : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ “కల్కి 2898 AD “..ఈ సినిమాను మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ తెరకెక్కించారు.వైజయంతి మూవీస్ బ్యానర్ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించింది.ఈ సినిమాలో ప్రభాస్ భైరవ అనే పాత్రలో కనిపిస్తున్నాడు.ప్రభాస్ సరసన దీపికా పదుకోన్ ,దిశా పటాని హీరోయిన్స్ గా నటించారు.అలాగే బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ ,లోక నాయకుడు కమల్ హాసన్ వంటి దిగ్గజ నటులు ఈ సినిమాలో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు.ఈ సినిమాను మేకర్స్ జూన్ 27 న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో మేకర్స్ ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచారు.

Read Also :Chiranjeevi : రామోజీరావు మరణంతో తెలుగుజాతి పెద్దదిక్కును కోల్పోయింది..

ఈ సినిమాలో స్పెషల్ క్యారెక్టర్ అయిన బుజ్జిని మేకర్స్ ఓ భారీ ఈవెంట్ ద్వారా ప్రేక్షకులకు పరిచయం చేసారు.బుజ్జి అంటే ఎవరో కాదు అది ఒక రోబోటిక్ కార్ ..ఈ కార్ పాత్ర సినిమాలో చాల ప్రత్యేకంగా ఉంటుందని మేకర్స్ తెలిపారు.బుజ్జికి స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ డబ్బింగ్ చెప్పింది.ఇదిలా ఉంటే ఈ చిత్రం ప్రమోషన్స్ లో భాగంగా దేశంలోని ప్రధాన నగరాలలో బుజ్జిని తిప్పుతూ మేకర్స్ ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు.బుజ్జి కార్ మొదటగా హైదరాబాద్ ఆ త‌రువాత చెన్నైలో సంద‌డి చేయ‌గా తాజాగా ముంబైలోని జుహు బీచ్‌లో సందడి చేసింది. ఈ కారును చూసేందుకు ఫ్యాన్స్ పోటీప‌డ్డారు.అలాగే ఈ కారును ఇప్ప‌టికే ప‌లువురు డ్రైవ్ చేయ‌గా తాజాగా ముంబై పోలీసులు కూడా దీన్ని డ్రైవ్ చేశారు.ప్రస్తుతం దీనికి సంబందించిన వీడియో బాగా వైరల్ అవుతుంది.

Show comments