డైరెక్టర్ బుచ్చిబాబు డైరెక్ట్ చేసిన మొదటి సినిమా ‘ఉప్పెన’లో హీరోకి క్లైమాక్స్ లో ఒక శరీర భాగం కట్ చేసి షాక్ ఇచ్చాడు. అదేవిధంగా, ఆయన ఇటీవల డైరెక్ట్ చేసిన రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమాలో కూడా మరో భాగాన్ని కట్ చేసి, “ఈ దర్శకుడు సినిమా అంటే కచ్చితంగా ఏదో ఒకటి కట్ చేస్తాడు” అని సోషల్ మీడియాలో మాట్లాడుకునేలా చేశాడు.
ఇక తాజాగా దర్శకుడు బుచ్చిబాబు, జగపతిబాబు ఇద్దరూ కలిసి ఒక ప్రమోషనల్ వీడియో చేశారు, దానిని రిలీజ్ చేశారు. అందులో జగపతిబాబు సరదాగా మాట్లాడుతూ, “ఒకవేళ నువ్వు హీరో అయితే, ఆ సినిమాలో ఏం కట్ చేస్తావ్?” అని ప్రశ్నించగా, దానికి బుచ్చిబాబు ఆసక్తికరంగా స్పందించాడు. “మేము హీరో ఏంటండీ బాబు? పక్కన నిలబడితే నాకు నిలబడటమే రాదు, ఇంకా యాక్టింగ్ కూడానా!” అంటూ చెప్పుకొచ్చాడు. అంతేకాక, “ఇకమీదట అలాంటి తప్పులు చేయను. ఇకమీదట కట్ చేయడం లాంటివి ఉండవు. ఇకమీదట అన్నీ మాస్ మసాలా సినిమాలే” అంటూ చెప్పుకొచ్చాడు. ఇక బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా రూపొందించబడిన ‘పెద్ది’ మంచి కలెక్షన్స్ రాబడుతూ దూసుకుపోతోంది. ఇప్పటికీ రూ. 345 కోట్ల రూపాయల కలెక్షన్స్ సాధించిన ఈ సినిమా, భారీ కలెక్షన్స్ సాధిస్తూ దూసుకుపోతోంది.

