AR Rahman: ఇక మీదట నా అన్ని సినిమాలు ఆయనే మ్యూజిక్ డైరెక్టర్: బుచ్చిబాబు

Adhika Masa Purnima (7)

Adhika Masa Purnima (7)

AR Rahman: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – డైరెక్టర్ బుచ్చిబాబు కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది. ఈ క్రమంలో చిత్ర యూనిట్ ప్రమోషన్లను పీక్స్‌కు తీసుకెళ్లింది. కాగా ఈ సినిమాకు ఆస్కార్ విజేత, మ్యూజిక్ లెజెండ్ ఏఆర్ రెహమాన్ అద్భుతమైన సంగీతాన్ని అందించారు. తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో డైరెక్టర్ బుచ్చిబాబు ఏఆర్ రెహమాన్‌తో తనకున్న అనుబంధాన్ని పంచుకుంటూ ఒక సంచలన ప్రకటన చేశారు. ఇకపై తాను తీయబోయే అన్ని సినిమాలకూ రెహమానే మ్యూజిక్ డైరెక్టర్ అని ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు.

రెహమాన్ గారితో జర్నీ ఒక అద్భుతం..
ఈ సినిమా కోసం ఏఆర్ రెహమాన్‌తో కలిసి పనిచేయడంపై బుచ్చిబాబు ఎంతో ఎమోషనల్ అయ్యారు. “రెహమాన్ గారితో ‘పెద్ది’ సినిమా కోసం సాగిన జర్నీ నిజంగా ఒక అద్భుతం. ఆయనతో కలిసి కూర్చుని ట్యూన్స్ చేయించుకోవడం, సాంగ్స్ కంపోజ్ చేయడం నా లైఫ్‌లోనే మర్చిపోలేని అనుభూతి. ఆయన అందించిన స్వరాలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ (BGM) ఈ సినిమాను ఎక్కడికో తీసుకెళ్లాయి” అని బుచ్చిబాబు కొనియాడారు. ఆల్రెడీ ఈ సినిమా నుంచి విడుదలైన సాంగ్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇంటర్వ్యూలోనే బుచ్చిబాబు ఒక క్రేజీ అప్‌డేట్ ఇస్తూ సంచలన ప్రకటన చేశారు. “రెహమాన్ గారి వర్కింగ్ స్టైల్‌కు, ఆయన జీనియస్‌కు నేను పూర్తిగా ఫిదా అయిపోయాను. అందుకే ఒక కీలక నిర్ణయం తీసుకున్నా. ఇక మీదట నేను చేయబోయే సినిమాలు అన్నిటికీ ఆయనే మ్యూజిక్ డైరెక్టర్. నా నెక్స్ట్ ప్రాజెక్ట్స్ అన్నిటికీ రెహమాన్ గారే సంగీతం అందిస్తారు” అని బుచ్చిబాబు స్పష్టం చేశారు. ఒక దర్శకుడు తన మ్యూజిక్ డైరెక్టర్‌పై ఈ రేంజ్‌లో నమ్మకం ఉంచడం టాలీవుడ్‌లో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. మరి ఏఆర్ రెహమాన్ సంగీతం, బుచ్చిబాబు టేకింగ్, రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ కలిసి జూన్ 4న థియేటర్లలో ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేయబోతున్నాయో చూడాలి.

×
×
Ad