మే 24 ఇంటర్నేషనల్ బ్రదర్స్ డే. ఈ సందర్భంగా పలువురు తమ తమ బ్రదర్స్ తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ఇక సినీ ప్రముఖులు సైతం సోదరుల పట్ల ఉన్న ప్రేమ చాటుకుంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి కూడా బ్రదర్స్ డే సందర్భంగా తన తమ్ముళ్ళతో ఉన్న బంధాన్ని గుర్తు చేసుకున్నారు. నాగబాబు, పవన్ కళ్యాణ్ తో చిన్నప్పటి ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసి శుభాకాంక్షలు చెప్పారు. ఈ బ్లాక్ అండ్ వైట్ ఫొటోలో చిన్నవాడైన పవన్ ను చిరంజీవి ఎత్తుకొనగా పక్కనే నాగబాబు నిలబడి ఉండడాన్ని చూడవచ్చు. ఈ ఫొటో షేర్ చేస్తూ ‘తోడ బుట్టిన బ్రదర్స్ కి రక్తం పంచిన బ్లడ్ బ్రదర్స్ కి హ్యాపీ బ్రదర్స్ డే!’ అని ట్వీట్ చేశారు చిరంజీవి. ఈ ఫొటోను అభిమానులు లైకులు.. రీ-ట్వీట్స్ తో వైరల్ చేయటం విశేషం.
బ్రదర్స్ డేన చిరు బ్రదర్స్ ట్వీట్ వైరల్!
