NTV Telugu Site icon

Braking News : మోహన్ బాబుపై చిన్న కొడుకు మంచు మనోజ్ ఫిర్యాదు

Manchu

Manchu

మోహాన్ బాబు అంటే క్రమశిక్షణ. క్రమశిక్షణ అంటే మోహన్ బాబు అంటే పేరుంది. అంతటి మోహన్ బాబు కుటుంబంలో ఇటీవల జరుగుతున్న పరిణామాలు వివాదాస్పదంగా మారుతుంది. ఆ మధ్య మంచు బ్రదర్స్ వ్యవహారం సంచలనం రేకిత్తించింది, మంచు మనోజ్ పై మంచు మనోజ్ దాడి చేస్తున్న వీడియోను రిలీజ్ చేస్తూ అర్ధరాత్రి ఇలా ఇంటికి వచ్చిబెదిరిస్తున్నాడు అని మనోజ్ వాపోయాడు. ఈ వివాదం అప్పట్లో సంచలం రేపింది. అన్నదమ్ముల మధ్య ఆస్తుల పట్ల చిన్న చిన్న వివాదాలు సహజం అని మోహన్ బాబు కొట్టిపారేసాడు.

నేడు  మరోసారి మంచు కుటుంబంలోని ఆస్తుల వ్యవహారం వివాదానికి దారితీసింది. ఈ దఫా తండ్రి కొడుకులు ఒకరిమీద ఒకరు కేసులు పెట్టుకునే వరకు వెళ్ళింది. వివరాలలోకెళితే  తన తండ్రి మోహన్ బాబు తనను కొట్టాడని పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసాడు మంచు మనోజ్. మోహన్ బాబు దాడిలో గాయపడిన మనోజ్ తగిలిన గాయాలతో పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టాడు. తన భార్య మౌనికపై కూడా దాడి చేసారని ఆరోపించాడు మనోజ్. అయితే మనోజే తనపై దాడి చేశాడని కొడుకుపై ఫిర్యాదు చేశాడు మోహన్ బాబు. స్కూల్, ఆస్తుల వ్యవహారంలో గత కొద్దీ రోజులుగా వీరి మధ్య వివాదం నడుస్తుండగా ఇప్పుడు పరస్పర దాడులు వెళ్లినట్టు తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పహాడీ షరీఫ్ పోలిసులు విచారణ చేస్తున్నారు.

Show comments