Site icon NTV Telugu

Mohan babu: మోహన్‌బాబు సమక్షంలో మీడియా ప్రతినిధులపై బౌన్సర్ల దాడి

Mohan Babu

Mohan Babu

హైదరాబాద్ జల్పల్లిలోని మోహన్ బాబు నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ రోజు సాయంకాలం పోలీస్ అధికారులు కలిసి ఎందుకు మంచు మనోజ్ దంపతులు ఆ నివాసం నుంచి బయటకు వెళ్లారు. అనంతరం డిజిపి ఆఫీస్ లో అడిషనల్ డీజీపీతో భేటీ అయిన తర్వాత తిరిగి ఆ నివాసానికి వెళితే గేట్లు ఓపెన్ చేయకుండా సెక్యూరిటీ సిబ్బంది కాసేపు ఇబ్బంది పెట్టారు. చాలాసేపు గేటు బయట కారులో ఉండిపోయిన మనోజ్ దంపతులు ఎంతకీ గేటు ఓపెన్ చేయకపోవడంతో కారు దిగి సెక్యూరిటీ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. తమ 7 నెలల పాప లోపలే ఉందని మౌనిక ఆందోళన వ్యక్తం చేసిన క్రమంలో మంచు మనోజ్ తన బౌన్సర్లతో గేట్లను బద్దలు కొట్టుకుంటూ లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు.

అయితే అప్పటికే అక్కడికి చేరుకున్న పోలీసులు ఇరుపక్షాల బౌన్సర్లను బయటకు పంపే ప్రయత్నం చేశారు. పూర్తిగా మోహన్ బాబు నివాసాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇదిలా జరుగుతుండగా మీడియా ప్రతినిధులపై మోహన్ బాబు సమక్షంలోనే బాన్సర్లు దాడికి దిగారు. మోహన్ బాబు ఏర్పాటు చేసుకొన్న బాన్సర్లు మీడియా ప్రతినిధులపై కర్రలతో దాడి చేసినట్లుగా తెలుస్తోంది. దీంతో ఆయా నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇక నివాసం నుంచి బయటకు వచ్చిన మోహన్ బాబు తీవ్ర ఆగ్రహవేశాలతో ఊగిపోయినట్లుగా తెలుస్తోంది.

Exit mobile version